నారాయణ శతకము - బమ్మెర పోతన
విషయ సూచిక :
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
క
ఖ
గ
ఘ
ఙ
చ
ఛ
జ
ఝ
ఞ
ట
ఠ
డ
ఢ
ణ
త
థ
ద
ధ
న
ప
ఫ
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
ళ
క్ష
ఱ
అ
(5)
Add New Padyam
అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్
సుధయై వేదవినూత్నరత్నములకున్ సూత్రాభిధానంబునై
బుధసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్
విధులై మీ బహునామరాజి వెలయున్ వేదాత్మ, నారాయణా !
- Added By
Chary
అన్నాకృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో
వెన్నల్ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తివై
యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి నిన్నోలి న్నుతుల్ సేయుచున్
గన్నుల్ మూయ యశోదకున్ జిఱుతవై కన్పింతు, నారాయణా !
- Added By
Chary
అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్
విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికిన్
గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ
కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా !
- Added By
Chary
అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతసామర్ధ్యులై
భ్రమరీదండము మందరాచలముగాఁ బాథోనిధిం ద్రచ్చగా
దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం
గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ నారాయణా !
- Added By
Chary
అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా
యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా !
- Added By
Chary
ఆ
(0)
Add New Padyam
ఇ
(2)
Add New Padyam
ఇరవొందన్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా
కరయన్ పద్మభవాండ భాండచయము న్నారాంగ మీకుక్షిలో
నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం
తర వాఃపూరము చంద మొంది యెపుడున్ దైత్యారి నారాయణా !
- Added By
Chary
ఇల నెవ్వారి మనంబులో నెఱుక దా నెంతెంత గల్గుండు నా
కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీ రూపులన్
అలరన్నంబు మితంబు లై సరసిలో నంభోరుహంబుల్ దగన్
నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా !
- Added By
Chary
ఈ
(0)
Add New Padyam
ఉ
(1)
Add New Padyam
ఉల్లోలంబుగాఁ గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ
మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే
పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ
పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా !
- Added By
Chary
ఊ
(0)
Add New Padyam
ఋ
(0)
Add New Padyam
ౠ
(0)
Add New Padyam
ఎ
(1)
Add New Padyam
ఎల రారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ
బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నెట్లోపెడున్
కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్
నిలువన్నేర్చునె భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా !
- Added By
Chary
ఏ
(1)
Add New Padyam
ఏ భావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యే భావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బే భావంబున నీ శరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే
నా భావంబున నీ తలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా !
- Added By
Chary
ఐ
(0)
Add New Padyam
ఒ
(2)
Add New Padyam
ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండవై
సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క
ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో
పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా !
- Added By
Chary
ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంత మం
దరయం బై పడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా !
- Added By
Chary
ఓ
(0)
Add New Padyam
ఔ
(0)
Add New Padyam
అం
(0)
Add New Padyam
అః
(0)
Add New Padyam
క
(12)
Add New Padyam
కడకంటం గడలేని సంపద లొగిం గావింపు లక్ష్మీశ పా
ల్కడలిన్ బన్నగశాయివై భువనముల్ గల్పించు సత్పుత్రునిన్
బొడమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతిం గన్న పదారవిందముల నే భావింతు నారాయణా !
- Added By
Chary
కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్
గడముట్ట న్వినుతింపలేక నిగుడన్ గ్రాలంగ నొప్పారు మి
మ్మడరన్ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని లోభాత్ముఁడన్
జడుఁడ న్నజ్ఞుఁడ నైకజిహ్వుఁడ జనస్తబ్ధుండ నారాయణా !
- Added By
Chary
కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా !
- Added By
Chary
కలయ న్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్ భక్తి విహీనుఁడైన పిదపన్ వ్యర్థప్రయత్నంబె పో
గులకాంతామణి గొడ్డువోయిన గతిం గొవ్వారుసస్యంబు దా
ఫలకాలంబుల నీచపోవు పగిదిన్ పద్మాక్ష, నారాయణా !
- Added By
Chary
కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్
వెలయన్ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబునన్
జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్
దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠనన్ దోషఘ్న, నారాయణా !
- Added By
Chary
కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీ నామంబు ప్రేమంబునన్
అలరన్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహంబు దా
వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా !
- Added By
Chary
కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై
కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ
వలనం గల్క్యవతార మొందఁగల నిన్ వర్ణింతు నారాయణా !
- Added By
Chary
కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజమగు నీ నామంబు ప్రేమంబుతో
నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయున్
వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా !
- Added By
Chary
కసవొప్పన్ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య
ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుఁగా బైకొన్న గోపాంగనా
రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్
పసిఁ గొంచున్ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా !
- Added By
Chary
కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయన్ సము
త్తాలాలోల తమాలపాదప శిఖాంతస్థుండవై వేణురం
ధ్రాలిన్ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో
పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా !
- Added By
Chary
కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా
షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబు సోఁకు నిను మున్ హేమాకృతిస్తోమమై
వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్ వేదాత్మ నారాయణా !
- Added By
Chary
కేలన్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం
బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళిన్ గట్టి క
ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
వాలన్ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా !
- Added By
Chary
ఖ
(0)
Add New Padyam
గ
(2)
Add New Padyam
గగనాద్యంచిత పంచభూతమయమై కంజాతజాండావలిన్
సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా
సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై
నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా !
- Added By
Chary
గణుతింపన్ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా
రణబంధుండని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగ నే
బ్రణతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడి లేకుండినన్
ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా !
- Added By
Chary
ఘ
(1)
Add New Padyam
ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొనర న్నొప్పెడువారు నీ పదరుచి న్నూహించు నారాయణా !
- Added By
Chary
ఙ
(0)
Add New Padyam
చ
(4)
Add New Padyam
చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై
మదిలోఁ బాయక నిన్ను నిల్పఁదగు నామర్మంబు వీక్షింపఁడే
మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త నారాయణా !
- Added By
Chary
చన్నుల్ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం
పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా
విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ
వన్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా !
- Added By
Chary
చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపాంబులన్
చల్లన్ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా !
- Added By
Chary
చెల్లం జేసితి పాతకంబులు మదిన్ శ్రీనాథ మీ నామముల్
పొల్లుల్ బోవని నమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిం దండ్రియు నీవుగాక యొరులే తర్కింప నారాయణా !
- Added By
Chary
ఛ
(0)
Add New Padyam
జ
(2)
Add New Padyam
జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ ! భూ
గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా ! ప్రదీపప్రయో
గి గణస్తుత్య మహాఘనాశన ! లసద్గీర్వాణ సంసేవితా !
త్రిగుణాతీత ! ముకుంద ! నాదు మదిలో దీపింపు, నారాయణా !
- Added By
Chary
జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసెన్ శైలంబు మాచేతులం
దిడు మన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్
గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా !
- Added By
Chary
ఝ
(0)
Add New Padyam
ఞ
(0)
Add New Padyam
ట
(0)
Add New Padyam
ఠ
(0)
Add New Padyam
డ
(0)
Add New Padyam
ఢ
(0)
Add New Padyam
ణ
(0)
Add New Padyam
త
(4)
Add New Padyam
తనకున్ సాత్వికసంపదాన్విత మహాదాసోహభావంబునన్
ననయంబు న్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్
జనితాహ్లాదముతోడ నీ చరణముల్ సద్భక్తి పూజించి నిన్
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా !
- Added By
Chary
తనచిత్తాబ్జము మీ పదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం
తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా !
- Added By
Chary
తనువుం జీవుఁడు నేక మైనపిదపన్ ధర్మక్రియారంభుఁడై
యనయంబు న్మది దన్నెఱుంగక తుది న్నామాయచే మగ్నుఁడై
తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా !
- Added By
Chary
తపముల్ మంత్రసమస్తయజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
జపముల్ పుణ్యసుతీర్థసేవఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
ఉపవాసవ్రతశీలకర్మఫలముల్ ఒప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా !
- Added By
Chary
థ
(0)
Add New Padyam
ద
(1)
Add New Padyam
దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ
లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
మల నాభీచరణారవిందజనితామ్నాయాద్య గంగా ! లస
జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా !
- Added By
Chary
ధ
(3)
Add New Padyam
ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహిముం జేసినన్
పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్ జేసితిన్
కరుణం జేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా !
- Added By
Chary
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీరంగ సత్పుత్రియై
వరుస న్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా !
- Added By
Chary
ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
పరగం బైతృక తర్పణంబు కొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్
నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జించి త
త్పరశుభ్రాజిత రామనామము కడున్ ధన్యంబు నారాయణా !
- Added By
Chary
న
(11)
Add New Padyam
నరసింహాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ
ధర గోవింద ముకుంద కేశవ జగత్త్రా తాహితల్పాంబుజో
దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం
దిర పీతాంబర భక్తవత్సల కృపన్ దీవింపు నారాయణా !
- Added By
Chary
నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబు తా
నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూని వే
ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా !
- Added By
Chary
నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీ నామమున్ వీనులన్
విని మోదింపనివాఁడు చెవ్డు మరి నిన్ వేడ్కన్ మనోవీథినిన్
గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై
తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా !
- Added By
Chary
నినుఁ వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా
నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా
నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా !
- Added By
Chary
నిరతానందవియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా
రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా !
- Added By
Chary
నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
నీ పాదోదక మీజగత్రయముల న్నిష్పాపులం జేయఁగా
నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ నారాయణా !
- Added By
Chary
నీ మూర్తుల్ గన నీ కథల్ వినఁ దుదిన్ నీ పాద నిర్మాల్యని
ష్ఠామోదంబు నెఱుంగ, నీ చరణతోయంబాడ, నైవేద్యముల్
నీమం బొప్ప భజింప నీ జపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీ మించన్ బహుజన్మ జన్మములకున్ శ్రీయాదినారాయణా !
- Added By
Chary
నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునన్
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీ నామజప్యంబునన్
నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా !
- Added By
Chary
నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ
నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ
నీవే శంకరమూలమంత్ర మరయ న్నీవే జగత్కర్తవున్
నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా !
- Added By
Chary
నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో
నొరుగుల్ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగ్యంబె చర్చింపఁగాఁ
గుఱుగణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం
జెఱకుం గోలకు తీపు గాక కలదే చేదెందుఁ నారాయణా !
- Added By
Chary
నే నీదాసుఁడ నీవు నా పతివి నిన్నే కాని యొండెవ్వరిన్
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నానేర్చుచందంబునన్
నీ నామస్తుతు లాచరించు నెడల న్నేతప్పులుం గల్గినన్
వానిన్ లోఁ గొనుమయ్య తండ్రి ! విహితవ్యాపార నారాయణా !
- Added By
Chary
ప
(12)
Add New Padyam
పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా
కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై
వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే
నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా !
- Added By
Chary
పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై
సురసిద్ధోరగయక్ష పక్షి మునిరక్షో హృద్గుహాభ్యంతర
స్థిరసుజ్ఞానసుదీపమై శ్ర్తుతికళాసిద్ధాంతమై సిద్ధమై
సరి లే కెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు, నారాయణా !
- Added By
Chary
పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబునన్
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తి న్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త నారాయణా !
- Added By
Chary
పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబు గా మీఁద మీ
చరణాంభోరుహదర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపాంభోజాక్ష నారాయణా !
- Added By
Chary
పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావు మీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా !
- Added By
Chary
పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁడై
నిరసిం చేరికిఁ గీడుసేయక మది న్నిర్ముక్తకర్ముండునై
పరమానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించు నా
పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా !
- Added By
Chary
పసులంగాపరి యే మెఱుంగు మధురప్రాయోల్లసద్వృత్తవా
గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డంచు నిన్
గసటుల్ సేయఁగ నాఁడు గోపిక లతద్గానంబులన్ మన్మథ
వ్యసనాసక్తులఁ జేయుచందములు నే వర్ణింతు, నారాయణా !
- Added By
Chary
పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద
త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో
వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రభోధించి య
ప్పురముల్ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు నారాయణా !
- Added By
Chary
పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా
గ రసావేశత రిత్త ద్రచ్చనిడ నా కవ్వంబు నీవు న్మనో
హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ
వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా !
- Added By
Chary
పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం
దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దునున్
ఘనపాపంబుల వైరి షడ్రిపులకున్ గాలావసానంబు మీ
వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా !
- Added By
Chary
ప్రభ మీ నాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం
బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై
యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా
నభవాఖ్యుండవు నిన్నెఱుంగవశమే యబ్జాక్ష, నారాయణా !
- Added By
Chary
ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్ భక్తి న్ననుష్ఠింపుచున్
నమర న్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణి గ్రామ దా
నము లామ్నాయ విధోక్తి భూసురులకున్ సన్మార్గుఁడై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁడగు న్నామీఁద నారాయణా !
- Added By
Chary
ఫ
(0)
Add New Padyam
బ
(2)
Add New Padyam
బలుకర్మాయత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
జలయంత్రాన్విత బంధయాతనగతిన్ సంసారకూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా ! యార్తుండనై వేఁడెదన్
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా !
- Added By
Chary
బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వభోగములకున్ భవ్యాధినాథుండవై
బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్ భావింప రాకున్న నా
జిహ్మవ్యాపుల నెన్న నాదు వశమే చిద్రూప నారాయణా !
- Added By
Chary
భ
(4)
Add New Padyam
భవనాశిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణవే
త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం
దవగాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా !
- Added By
Chary
భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబింబంబు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
భువిలో మీదగు మంత్రరాజ మమరున్ భూతాత్మ, నారాయణా !
- Added By
Chary
భీమాకారవరాహమై భువనముల్ భీతిల్లి కంపింప ను
ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్
హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మిన్ గారవింపంగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినున్ బూజింతు నారాయణా !
- Added By
Chary
భూతవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
పేతంబై పరమాత్మవై నిలుతు నీ పెంపెవ్వరుం గాన ర
బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ట, నారాయణా !
- Added By
Chary
మ
(6)
Add New Padyam
మగమీనాకృతి వార్థిఁ జొచ్చి యసుర న్మర్దించి యవ్వేదముల్
మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ
బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్
ఖగరాజధ్వయ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణా !
- Added By
Chary
మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
గదియం జేర్చిన వాని కే నొడయడన్ గా దంచు నత్యున్నతిన్
పదిలుం డై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా !
- Added By
Chary
మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై
మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై
యెనయన్ సాయకశాయికిం జననయై యేపారు మిన్నేటికిం
జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు నారాయణా !
- Added By
Chary
మమహంకార వికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రా దింక నాలోన నీ
విమలాపాంగ దయా దివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా ! కంజాక్ష ! నారాయణా !
- Added By
Chary
మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా
గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో
విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్
సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర నారాయణా !
- Added By
Chary
మాపాలం గడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చి యుండుదు వెస న్మాపాలలో నుండు మీ
మాపా లైన సుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తా గొల్లలన్
మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నింతు, నారాయణా !
- Added By
Chary
య
(1)
Add New Padyam
యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్
మదవద్ధేనుక ముష్టికాద్యసురులన్ మర్దించి లీలారసా
స్పద కేళీ రతి రేవతీ వదన కంజాతాంతభృంగం బనన్
విదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణా !
- Added By
Chary
ర
(3)
Add New Padyam
రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
పము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రాఖ్య కా
వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా !
- Added By
Chary
రసనాగ్రంబున నీదు నామరుచియున్ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జయుగ్మంబులన్
వెస నీ పాదసుపూజితాదియుగమున్ విజ్ఙానమధ్యాత్మకున్
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా !
- Added By
Chary
రాణించెన్ గడు నంచు నీ సహచరుల్ రాగిల్లి సోలంగ మీ
వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్ బయల్ ముట్టఁగా
ఘోణాగ్రంబులు మీదిఁ కెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో
శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు, నారాయణా !
- Added By
Chary
ల
(4)
Add New Padyam
లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్ల న్మించెఁ బో నీకథా
వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్థార్థకామోదముల్
పెలుచం బూనిన యక్కరాటము తుదిన్ బేతేకరాటంబె పో
చలదిందీవరపత్రలోచన ఘనశ్యామాంగ నారాయణా !
- Added By
Chary
లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
బలుఁగు ల్వారఁగ నీ కటాక్షమునఁ దా మందంద గోపాంగనల్
తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా
నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా !
- Added By
Chary
లలితాకుంచితవేణియం దడవిమొల్లల్ జాఱ ఫాలస్థలిన్
దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్
మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకలన్ బోవఁగా
నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా !
- Added By
Chary
లీలన్ పూతన ప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు
శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా
రోల న్మద్దులు గూల్చిధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలన్ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు, నారాయణా !
- Added By
Chary
వ
(10)
Add New Padyam
వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా !
- Added By
Chary
వరనాభీధవళాంబుజోదరమునన్ వాణీశుఁ గల్పించి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా !
- Added By
Chary
వరుసం దాటకిఁ జంపి కైశికు మఘ స్వాస్థ్యంబు గావించి శం
కరుచాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రిపం
పరుదారన్ వనభూమి కేఁగి జగదాహ్లాదంబుగా రావణున్
ధరణిం గూల్చిన రామనామము కడున్ ధన్యంబు నారాయణా !
- Added By
Chary
వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ
బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం
బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచున్నుండు మీ
తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా !
- Added By
Chary
విందు ల్వచ్చిరి మీ యశోదకడకు న్వేగంబె పొమ్మయ్యయో
నందానందన ! చందనాంకురమ ! కృష్ణా ! యింకఁబో వేమి మా
మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మిమ్మెత్తుకో
చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా !
- Added By
Chary
విందుల్ విందు లటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ
డందెల్ మ్రోయఁగ ముద్దుమోమలర నిన్నాలింగితుం జేయుచో
డెందంబుల్ దనివార రాగరసవీటీలీలలన్ దేల్చు మీ
మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా !
- Added By
Chary
విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా
స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీట రత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా !
- Added By
Chary
వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ
వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంసారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెసన్ దైత్యారి నారాయణా !
- Added By
Chary
వెలయన్ యౌవనకాలమందు మరుఁడున్ వృద్ధాప్యకాలంబునన్
బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ
పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా !
- Added By
Chary
వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాస పరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁడంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా !
- Added By
Chary
శ
(3)
Add New Padyam
శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా
భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులున్,
లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియున్ గల్గు నా
లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా !
- Added By
Chary
శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా !
- Added By
Chary
శ్రీరామామణిపాణి పంకజ మృదుశ్రీతజ్ఞపాదాబ్జ శృం
గారాకారశరీర చారుకరుణాగంభీర సద్భక్త మం
దారాంభోరుహపత్రలోచన కళాధారోరుసంపత్సుధా
పారావార విహార ! నా దురితముల్ భంజింపు నారాయణా !
- Added By
Chary
ష
(0)
Add New Padyam
స
(7)
Add New Padyam
సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీనివాససుఖమున్ మా నాథ నారాయణా !
- Added By
Chary
సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతి దర్పణమున న్నిస్సంగుఁడై తన్ను దా
నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష, నారాయణా !
- Added By
Chary
సర్వంబున్ వసియించు నీ తనువునన్ సర్వంబునం దుండగా
సర్వాత్మా ! వసియించు దీవని మదిన్ సార్థంబుగాఁ జూచి యా
గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా
శ్రీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా !
- Added By
Chary
సవిశేషోరు సువర్ణబిందు విలస చ్చక్రాంకలింగాకృతిన్
భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
దివిజేంద్రాది దిశాధినాయకులచే దీప్యన్మునీంద్రాళిచే
నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా !
- Added By
Chary
సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండు నై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
మృతిఁ బొందించి దమంబునన్ శమమునన్ మీఱంగ వర్తించు ని
ర్గతసంసారి భవత్కృపం బొరయ నో కంజాక్ష నారాయణా !
- Added By
Chary
స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్
దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరున్
శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్ శోభిల్ల మన్నించి య
జ్జభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు నారాయణా !
- Added By
Chary
స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్
మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులో నేడ్పగున్
నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చనున్
నీనామోక్తియు నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణా !
- Added By
Chary
హ
(1)
Add New Padyam
హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం
గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదున్
గర మొప్పన్విదురున్ బరాశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్
నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా !
- Added By
Chary
ళ
(0)
Add New Padyam
క్ష
(0)
Add New Padyam
ఱ
(0)
Add New Padyam