 |
|
|
| తెలుగు సామెతలు |
విషయ సూచిక :
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
క
ఖ
గ
ఘ
ఙ
చ
ఛ
జ
ఝ
ఞ
ట
ఠ
డ
ఢ
ణ
త
థ
ద
ధ
న
ప
ఫ
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
ళ
క్ష
ఱ
అ (98)
Add New Sameta
- అంటు, సొంటు లేని మేనమామ కొడుకు పొగడ చెట్టు కింద కూర్చుని పక్కలెగరేసాడట.
- Added By Vagdevi
- అంతా అయినోళ్ళేగానీ అన్నం పెడతానని ఒక్కరూ అనరు
- Added By Sphoorty1
- అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట
- Added By Editor
- అక్క మనదైతే బావ మనవాడా?
- అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ.
- అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
- అగ్నికి వాయువు తోడైనట్లు
- అగ్రహారాలన్నీ పోతే పోయాయి గానీ, ఆక్టు బాగా తెలిసిందన్నాడు.
- Added By Vagdevi
- అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ
- Added By Sarma
- అటునుండి నరుక్కు రా
- అడకత్తెరలొ పోకచెక్కలా
- Added By Ray
- అడకత్తెరలో పోకచెక్క
- అడగందే అమ్మ అయినా పెట్టదు
- అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
- అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు
- అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
- అడుక్కుతినేవాడికి అర్ధరాజ్యమిచ్చినా అడుక్కుతినేచిప్ప కడుక్కుదాచుకున్నడట
- Added By Ray
- అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
- అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
- అడుక్కున్నమ్మకు 60 కూరలట, వండుకున్నమ్మకు ఒకటే కూరట
- అడుసు తొక్కనేల కాలు కడగనేల
- అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
- అతగాడే ఉంటే మంగలెందుకు
- Added By Sarma
- అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న
- అతి రహస్యం బట్టబయలు
- అతి వినయం ధూర్త లక్షణం
- అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు.
- అత్త సొమ్ము అల్లుడు దానం
- అత్తకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దసరా పండగ అన్నాడంట
- Added By Yamakinkarudu
- అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
- అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
- అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
- అత్తా నీ పైట తొలగిందన్నా తప్పే తొలగలేదన్నా తప్పే
- Added By Sphoorty1
- అత్యాశ ఎప్పుడూ అనర్ధమే
- అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
- అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
- అద్దం అబద్ధం చెప్పదు
- అధికమైతే అమృతం కూడా విషమే
- అనగా అనగా రాగం తినగా తినగా రోగం
- అనుమానం పెనుభూతం
- అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
- అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
- అన్నదానం కన్నా విద్యాదానం మిన్న
- అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు
- అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
- అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
- అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
- అన్నీ ఉన్నాయి, అంచుకు తొగరే లేదు.
- Added By Sarma
- అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట
- అప్ప ఆరటమేగాని....బావపెట్టిసచ్చిందిలేదు
- Added By Ray
- అప్పిచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్లు
- అప్పిచ్చువాడు వైద్యుడు
- అప్పు నిప్పులాంటిది...
- అప్పుచేసి పప్పు కూడు
- అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
- అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
- అభ్యాసము కూసువిద్య
- అమరం నెమరుకు వస్తే కావ్యాలను కాల్చివేయనా.
- Added By Sarma
- అమెరికా ఎక్కడరా అంటె ఆ మెరక దాటితె అమెరికాయెరా అన్నాడట.
- Added By Sumantha
- అమ్మ అదృష్టాన నడిచే పిల్లలు పాకిరేరుట
- Added By Sarma
- అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
- అమ్మ కన్న ఆరుగురూ సంగీత పాఠకులే
- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
- అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
- అమ్మబోతె అడవి కొనబోతె కొరివి
- Added By Indian
- అమ్మాయి గడప దాటి చెడిద్ది,అబ్బాయి గడప దాటక చెడతాడు
- Added By Ajay
- అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
- అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
- అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
- అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
- అయోమయం....జగన్నాథం!
- Added By Ajay
- అయోమయం.....అడవి పంచాంగం
- Added By Indian
- అయ్య వచ్చేవరకూ అమావాస్య ఆగుతుందా?
- అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు
- అయ్యవారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
- అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు
- అరచేత్తో సూర్యుని కిరణాలు ఆపలేవు
- Added By Ajay
- అరిచే కుక్క కరవదు
- అర్దరాత్రి మద్దెల దరువు
- అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా
- అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
- అల్పుడికి ఐశ్వరం వస్తే అర్ధరాత్రి గొడుగు తీసుకుని రమ్మన్నాడుట
- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
- అల్లుడి ఆశా తీరింది .. అత్త అప్పూ తీరింది
- అసలు అయిదు మూరలు చాలు కొసరు పది మూరలు కావాలన్నాడట.
- Added By Sumantha
- అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి అట
- అసలు లేని బావ కంటే గుడ్డి బావే మేలు
- అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
- అసలుకంటె కొసరే ముద్దు.
- Added By Sumantha
- అసలుకే ఎసరు పెట్టినట్లు
- అసలే కోతి, ఆపై కల్లు తాగినట్టు
- అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
- ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలబడలేదు
- మిన్ను కురవక చేను పండదు....కన్ను కురవక బ్రతుకు పండదు
- Added By Sphoorty1
- అత్త కు ఆయసం ఎక్కువ ,కోడలి కి కోపము ఎక్కువ
- Added By Purni
- అత్త కు ఆయసం ఎక్కువ ,కోడలి కి కోపము ఎక్కువ
- Added By Purni
- అర చేతిలో బెల్లం పెట్టి మోచెయ్యి నాకించినట్టు
- Added By Purni
ఆ (57)
Add New Sameta
- ఆ తానులో గుడ్డే
- Added By Vagdevi
- ఆలూలేదూ చూలూలేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్ ( ఇది లేటెస్టు సామెత)
- Added By Sarma
- ఆ తాను ముక్కే
- ఆ మొద్దు లోదే ఈ పేడు
- ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నట్లుంది
- Added By Yamakinkarudu
- ఆంబోతులా పడి మేస్తున్నావు
- ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
- ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గెరగదు
- ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
- ఆకలేస్తే రోకలి మింగు..అరగక పోతే తిరగలి మింగు
- Added By Ray
- ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...
- ఆకారపుష్టి నైవేద్యనష్టి
- ఆకాశానికి హద్దే లేదు
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
- ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
- ఆడదాని వయసు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు
- ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
- ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
- ఆడబోయిన తీర్థమెదురైనట్లు
- ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
- ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు
- ఆడువారి మాటలకు అర్ధాలే వేరు
- ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు
- [[ ఆత్రం పెళ్ళికొడుకు లంగోటా చించుకున్నాట్ట ]]
- Added By Sudeepi
- ఆత్రగాడికి బుద్ది మట్టం
- ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
- ఆదిలోనే హంసపాదు
- ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు
- ఆపదలో మొక్కులు, సంపదలో మరపులు
- ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
- ఆమరకా ఈమరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
- ఆయనే ఉంటే మంగలి ఎందుకు
- ఆయనే ఉంటే మంగలి ఎందుకు?
- ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
- ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
- ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు
- Added By Panipuri123
- ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
- ఆరేసుకోబోయి పారేసుకున్నట్టు
- Added By Yamakinkarudu
- ఆరోగ్యమే మహాభాగ్యం
- ఆలస్యం అమృతం విషం
- ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
- ఆలి మరు కవాటం, ఇల్లు ఇరు కవాటం
- Added By Srinivasaraoachalla
- ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
- ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే, చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
- ఆలూ మగల కలహం ఆకు వక్క నమిలినంత సేపే
- Added By Panipuri123
- ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
- ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
- ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
- ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
- ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
- ఆశకి అంతం లేదు
- ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
- ఆశగా దోసెలేసుకుంటె అల్లుడొచ్చి లాక్కుతిన్నాడట.
- Added By Sumantha
- ఆసనాలు వేస్తే పాసనాలు పట్టాయట
- Added By Panipuri123
- ఆస్తి మూరెడు ఆశ బారెడు
ఇ (24)
Add New Sameta
- ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
- ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
- [[ ఇంటి పేరూ కస్తూరి వారు ఇంటినిండా గబ్బిలాల కంపు. ]]
- Added By Rajeshwari93
- ఇంటికన్న గుడి పదిలం
- Added By Vedantamrk
- ఇంటికన్నా గుడి పదిలం
- ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
- ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
- ఇంట్లో పిల్లి, వీధిలో పులి
- ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
- ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
- [[ ఇంతోటి పెళ్ళికీ ఈ ఒక్క మొగుడేనా ]]
- Added By Sphoorty1
- ఇద్దరు ముద్దు, ఆపై వద్దు
- ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
- ఇరుగు ఇంగలం,పొరుగు మంగలం.
- Added By Vagdevi
- ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
- ఇల్లరికం అల్లుడు చెబితే వినడు..కొడితే ఏడుస్తాడు
- Added By Ray
- ఇల్లలకగానే పండగకాదు
- ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
- ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
- ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
- ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చూరులో చుట్ట కాలి ఇంకోడు ఏడ్చాడుట
- ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
- ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
- ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
ఈ (7)
Add New Sameta
ఉ (12)
Add New Sameta
ఊ (9)
Add New Sameta
ఋ (1)
Add New Sameta
ౠ (0)
Add New Sameta
ఎ (29)
Add New Sameta
ఏ (20)
Add New Sameta
ఐ (3)
Add New Sameta
ఒ (4)
Add New Sameta
ఓ (5)
Add New Sameta
ఔ (0)
Add New Sameta
అం (27)
Add New Sameta
అః (0)
Add New Sameta
క (89)
Add New Sameta
- కాకిలా కలకాలం ఉండేకంటే, హంసలా కొద్దికాలమున్నా మేలు
- కడుపు తీపి, కన్న కడుపు తీయ దనము, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూచుట
- Added By Vagdevi
- కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు
- కంగారులో హడావుడి అన్నట్లు
- కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
- కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
- కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
- కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
- కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
- కంచేచేను మేసినట్లు
- కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
- కంటికి రెప్ప కాలికి చెప్పు
- కంటికి రెప్ప దూరమా
- కండలేని వానికే గండం
- కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
- కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
- కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
- కంపలో పడ్డ గొడ్డు వలె
- కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
- కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు
- కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
- కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
- కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
- కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
- కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
- కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
- కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
- కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
- కణత తలగడ కాదు. కల నిజం కాదు
- కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు
- కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
- కన్నొక్కటి లేదు గాని,కంతుడు కాడే?!
- Added By Vagdevi
- కన్య,కీర్తి,కనకం ఇవే మగవాడి వెంట పడాలి కానీ,మగవాడు వీటి వెంట పడకూడదు
- Added By Ajay
- [[ కబళే కబళే, గోవిందా! ]]
- Added By Vagdevi
- కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
- కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
- కలసి ఉంటే కలదు సుఖం
- కలిపి కొట్టరా!కావేటి రంగా!
- Added By Vagdevi
- కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
- కల్లు త్రాగిన కోతిలా
- కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
- [[ కాకి కావ్ మంటే - కాంతుని కౌగిలించుకున్నట్లు. ]]
- Added By Vagdevi
- కాకి పిల్ల కాకికి ముద్దు
- కాకిని తెచ్చి పంజరములో ఉంచితే చిలకవలె పలుకునా ?
- Added By Indian
- కాకిముక్కుకి దొండపండు
- Added By Ray
- కాగల కార్యం గంధర్వులే తీర్చారు
- కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
- కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
- కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
- కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
- కాలు కాలిన పిల్లిలా
- కాలు జారితె తీసుకోగలము కాని, నోరు జారితె తీసుకోలేము
- Added By Indian
- కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
- కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
- కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
- కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
- కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
- కుక్క కాటుకి చెప్పు దెబ్బ
- కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
- కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
- కుక్కతోక వంకరన్నట్లు...!
- కుట్టేవాడికి కుడి వైపు....చీదే వాడికి ఎడమవైపు ఉండొద్దన్నారు...
- Added By Ray
- కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
- కుమ్మర వీధిలో కుండలు అమ్మినట్లు
- Added By Indian
- కూటికి లేకున్నా కాటుక మాననట్లు
- కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
- కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
- కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
- కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
- కొండపైకి కట్టెపుల్లలు మోసుకెళ్లినట్లు
- Added By Indian
- కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
- కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
- కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి
- Added By Indian
- కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
- కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
- కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
- కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
- కోటి విద్యలు కూటి కోసమే
- కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
- కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
- కోతిగంతులు...సాయిబు వసూళ్ళు
- Added By Ray
- కోతీ కోతీ ఎందుకు పుట్టావ్ అంటే చక్కనోడిని వెక్కిరించడానికి అని చెప్పిందంట!
- Added By Ajay
- కోపం వస్తే కొట్టి చంపుతాడు, తాపం వస్తే కొరికి చంపుతాడు
- Added By Sarma
- కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
- కోస్తే తెగదు కొడితే పగలదు
- క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
- క్షణం తీరికా లేదు, దమ్మిడీ ఆదాయం లేదు .
- Added By Raga
- 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి పుట్టే' అందిట.
ఖ (0)
Add New Sameta
గ (40)
Add New Sameta
ఘ (3)
Add New Sameta
ఙ (0)
Add New Sameta
చ (46)
Add New Sameta
ఛ (1)
Add New Sameta
జ (13)
Add New Sameta
ఝ (0)
Add New Sameta
ఞ (0)
Add New Sameta
ట (1)
Add New Sameta
ఠ (0)
Add New Sameta
డ (6)
Add New Sameta
ఢ (1)
Add New Sameta
ణ (0)
Add New Sameta
త (53)
Add New Sameta
- తాటిపండు తింటావా తలకొట్టుకుంటావా
- Added By Sarma
- తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
- తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
- తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
- తడి గుడ్డతో గొంతు కొయ్యడం
- తనకి తింటానికి తిండి లేకపోతే ముండ వచ్చి మటన్ బిర్యాని అడిగిందంట
- Added By Ajay
- తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
- తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
- తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
- తల ప్రాణం తోకకి వచ్చినట్లు
- తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
- తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
- తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
- తా వలచినది రంభ, తా మునిగింది గంగ
- తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
- తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
- తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
- తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
- తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
- తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
- తాతకు దగ్గులు నేర్పినట్టు
- తాదూర సందు లేదు, మెడకో డోలు
- తానా అంటే తందానా అన్నట్లు
- తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లు
- Added By Indian
- తాను దూర సందు లేదు తలకో కిరీటమట
- తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
- తామరాకు మీద నీటిబొట్టులా
- తాళ్ళపాక వారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత
- Added By Panipuri123
- తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
- తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయి
- తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
- తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
- తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
- తిట్టను పోరా గాడిదా అన్నట్టు
- తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
- తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
- తినకపోతే నీరసం...తింటే ఆయాసం...
- Added By Ray
- తినగ తినగ వేము తియ్యగనుండు
- తినబోతూ రుచులు అడిగినట్లు
- తిన్నింటి వాసాలు లెక్కేయటం
- తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
- తిరిగేకాలు తిట్టేనోరు ఊరుకోవు
- తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
- తీయగా తీయగా రాగం, మూల్గ గా మూల్గ గా రోగం
- Added By Panipuri123
- తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
- తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
- తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
- తేలు కుట్టిన దొంగలా
- తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
- తోక తెగిన కోతిలా
- తోక ముడుచుట
- తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
- తోటెమ్మ తొడకోసుకుంటే తాను మెడకోసుకుందిట
- Added By Sarma
థ (0)
Add New Sameta
ద (29)
Add New Sameta
ధ (4)
Add New Sameta
న (43)
Add New Sameta
ప (63)
Add New Sameta
ఫ (0)
Add New Sameta
బ (24)
Add New Sameta
భ (4)
Add New Sameta
మ (45)
Add New Sameta
- మంగలిని చూసి గాడిద కుంటినట్లు
- మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
- మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
- మంచోళ్ళకు మాటలతోనూ, మొండోళ్ళకు మొట్టికాయలతోనూ చెప్పాలి
- మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
- మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
- మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
- మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
- మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
- మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
- మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
- మసి పాత(లో ) ఉన్న మాణిక్యము
- Added By Vagdevi
- మహారాజా వారని మనవి చేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట!
- Added By Vagdevi
- మా ఇంటికొస్తే ఏమి తెస్తావ్...మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావ్..
- Added By Ray
- మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
- మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
- మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
- మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
- మామగారు జానివాకర్ తాగితే అల్లుడుగారు చివాస్ రీగల్ తాగుతాడా?
- Added By Panipuri123
- మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
- మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
- మింగ లేక మంగళవారం అన్నాడట
- ముంజేతి కంకణానికి అద్దమేల ?
- ముందు నుయ్యి వెనుక గొయ్యి
- ముందుంది ముసళ్ళ పండుగ
- ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
- ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
- ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
- మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
- ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
- మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
- మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
- మొండివాడు రాజు కన్నా బలవంతుడు
- మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
- మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
- మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
- మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
- మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
- మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
- మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
- మొరిగే కుక్క కరవదు
- మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
- మోరెడు ముందుకు పోయి బారెడు వెనుకకి రాకూడదు
- Added By Ajay
- మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
- మౌనం అర్ధాంగీకారం
య (2)
Add New Sameta
ర (25)
Add New Sameta
ల (5)
Add New Sameta
వ (29)
Add New Sameta
శ (11)
Add New Sameta
ష (0)
Add New Sameta
స (23)
Add New Sameta
హ (4)
Add New Sameta
ళ (0)
Add New Sameta
క్ష (2)
Add New Sameta
ఱ (0)
Add New Sameta