 |
|
|
| నరసింహ శతకము - శేషప్పకవి |
విషయ సూచిక :
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
క
ఖ
గ
ఘ
ఙ
చ
ఛ
జ
ఝ
ఞ
ట
ఠ
డ
ఢ
ణ
త
థ
ద
ధ
న
ప
ఫ
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
ళ
క్ష
ఱ
అ (9)
Add New Padyam
ఆ (2)
Add New Padyam
ఇ (4)
Add New Padyam
ఈ (0)
Add New Padyam
ఉ (1)
Add New Padyam
ఊ (0)
Add New Padyam
ఋ (0)
Add New Padyam
ౠ (0)
Add New Padyam
ఎ (0)
Add New Padyam
ఏ (0)
Add New Padyam
ఐ (1)
Add New Padyam
ఒ (0)
Add New Padyam
ఓ (0)
Add New Padyam
ఔ (0)
Add New Padyam
అం (2)
Add New Padyam
అః (0)
Add New Padyam
క (7)
Add New Padyam
ఖ (0)
Add New Padyam
గ (3)
Add New Padyam
ఘ (0)
Add New Padyam
ఙ (0)
Add New Padyam
చ (1)
Add New Padyam
ఛ (0)
Add New Padyam
జ (2)
Add New Padyam
ఝ (0)
Add New Padyam
ఞ (0)
Add New Padyam
ట (0)
Add New Padyam
ఠ (0)
Add New Padyam
డ (0)
Add New Padyam
ఢ (0)
Add New Padyam
ణ (0)
Add New Padyam
త (6)
Add New Padyam
థ (0)
Add New Padyam
ద (3)
Add New Padyam
ధ (3)
Add New Padyam
న (16)
Add New Padyam
- నరసింహ! నా తండ్రి! నన్నేలు! నన్నేలు! - కామితార్థము లిచ్చి కావు! కావు!
దైత్యసంహార! చాల దయయుంచు! దయయుంచు! - దీనపోషక! నీవె దిక్కు! దిక్కు!
రత్నభూషితవక్ష! రక్షించు! రక్షించు! - భువనరక్షక! నన్ను బ్రోవు! బ్రోవు!
మారకోటిసురూప! మన్నించు! మన్నించు! - పద్మలోచన! చేయి పట్టు! పట్టు!
సురవినుత! నేను నీ చాటు జొచ్చినాను
నా మొరాలించి కడతేర్చు నాగశయన!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె - సుగుణ మొక్కటిలేదు చూడఁబోవ
నన్యకాంతల మీద నాశ మానగలేను - ఒరుల క్షేమముఁ జూచి యోర్వలేను
యిటువంటి దుర్బుద్ధు లిన్ని నాకున్నవి - నేను జేసెడివన్ని నీచకృతులు
నావంటి పాపిష్టినరుని భూలోకాన - బుట్టఁజేసితివేల భోగిశయన!
అబ్జదళనేత్ర! నా తండ్రివైన ఫలము
నేరములు కాచి రక్షించు! నీవె దిక్కు!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - దురితజాలములెల్లఁ దోలవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత - దండహస్తుని బంట్లఁ దరుమవచ్చు
భళిర! నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠపదవి సాధింపవచ్చు
భూషణ వికాస! శ్రి ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నరసింహ! నీవంటి దొరను సంపాదించి - కుమతిమానవుల నే గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను - బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనము గాదిది నీకుఁ గరుణను బోషింపఁ - గష్ట మెంతటి స్వల్పకార్యమయ్య?
పెట్టజాలక యేల భిక్ష మెత్తించెదు - నన్ను బీదను జేసినా వదేమి?
విమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగ
కన్నులకుఁ బండువై నీకుఁ గానబడునె?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నరసింహ! నే నిన్ను నమ్మినందుకు చాల - నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టె - నింకనైన గటాక్ష మియ్యవయ్య!
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు - భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠనగరమందే యుంచు - నరకమందే యుంచు నళిననాభ!
యెచట నన్నుంచినంగాని యెపుడు నిన్ను
మరచిపోకుండ నామసంస్మరణ నొసగు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నవసరోజదళాక్ష! నన్ను బోషించెడి - దాతవు నీవంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకు తండ్రి! - మేలు నా కొనరింపు నీలదేహ!
భళిభళి! నీయంత ప్రభువు నెక్కడ జూడఁ - బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందు చేసిన పాపమును నశింపగజేసి - నిర్వహింపుము నన్ను నేర్పుతోడ
పరమ సంతోషమాయె నా ప్రాణములకు
నీ రుణముఁ దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నా తండ్రి! నా దాత! నా యిష్టదైవమా! - నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీదఁ దప్పులన్ని క్షమించి - నిగమగోచర! నాకు నీవె దిక్కు
నే దురాత్ముడనంచు నీ మనంబున గోప - గింపబోకుము స్వామి! కేవలముగ
ముక్తిదాయక! నీకు మ్రొక్కినందుకు నన్ను - గరుణించి రక్షించు కమలనాభ!
దండి దొరవంచు నీవెంటఁ దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నాగేంద్రశయన! నీ నామ మాధుర్యంబు - మూడుకన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల - భారతీపతియైన బ్రహ్మ కెరుక
మధుకైటభారి! నీ మాయాసమర్థత - వసుధలో బలిచక్రవర్తి కెరుక
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు - దశశతాక్షుల పురందరున కెరుక
వీరి కెరుకగు నీ కథల్ వింతలెల్ల
నరుల కెరుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు - లెస్సగా పూజింపలేను సుమ్మి
నాకుఁ దోచిన భూషణములు బెట్టెదనన్న - గౌస్తుభమణి నీకు కలదు ముందె
భక్ష్యభోజ్యముల నర్పణము జేసెదనన్న - నీవు పెట్టితి సుధ నిర్జరులకు
కలిమి కొద్దిగగాను కల నొసంగెదనన్న - భార్గవీదేవి నీ భార్య యయ్యె
నన్ని గలవాడ వఖిలలోకాధిపతివి
నీకు భూషాదులను బెట్ట నెంతవాడ?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన - యజ్ఞకర్తగు సోమయాజియైన
ధరణి లోపల ప్రభాతస్నానపరుడైన - నిత్య సత్కర్మాది నిరతుడైన
నుపవాస నియమంబునొందు సజ్జనుడైన - గావివస్త్రము గట్టు ఘనుడునైన
దండి షోడశ మహాదానపరుండైన - సకల యాత్రలు సల్పు సరసుడైన
గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్షసామ్రాజ్యమొందడు మోహనాంగ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నీ కథల్ చెవులలో సోకుట మొదలుగాఁ - బులకాంకురము మేనఁ బుట్టువాడు
నయమైన నీ దివ్యనామ కీర్తనలోన - మగ్నుడై దేహంబు మరచువాడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ - బ్రేమతో దండ మర్పించువాడు
హా పుండరీకాక్ష! హా రామ! హరి! యంచు - వేడ్కతోఁ గేకలు వేయువాడు
చిత్తకమలంబునను నిన్ను జేర్చువాడు
నీదు లోకంబునందుండు నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నీ భక్తులను గనుల్ నిండఁ జూచియు రెండు - చేతుల జోహారు చేయువాడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ - వినయమొందుచుఁ జాల వినెడివాడు
తన గృహంబునకు నీ దాసులు రాఁజూచి - పీటపైఁ గూర్చుండబెట్టువాడు
నీ సేవకుల జాతినీతులెన్నక చాల - దాసోహమని జేరదలచువాడు
పరమభక్తుండు, ధన్యుండు భానుతేజ!
వానిఁ గనుగొన్న బుణ్యంబు వసుధలోన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నీకు దాసుడనంటి, నిన్ను నమ్ముకయుంటిఁ - గాన నాపై నేడు కరుణఁ జూడు
దోసిలొగ్గితి నీకు, ద్రోహమెన్నగబోకు - పద్మలోచన! నేను బరుడఁ గాను
భక్తి నీపై నుంచి భజనఁ జేసెదఁ గాని - పరుల వేడనుఁ జుమ్మి, వరములిమ్ము
దండి దాతవు నీవు, తడవు సేయక కావు - ఘోర పాతకరాశిఁ గొట్టివైచి
శీఘ్రముగఁ గోర్కె లీడేర్చు, చింతఁ దీర్చు
నిత్యమును నన్నుఁ బోషించు, నెనరు నుంచు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నీమీద కీర్తనల్ నిత్యగానముఁ జేసి - రమ్యమొందింప నారదుడగాను
సావధానముగ నీ చరణపంకజ సేవ - సలిపి మెప్పింపంగ శబరిగాను
బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ - గలుగను బ్రహ్లాద ఘనుడగాను
ఘనముగా నీమీద గ్రంథముల్ గల్పించి - వినుతిసేయను వ్యాసమునినిగాను
సాధువును, మూర్ఖమతిని, మనుష్యాధముడను
హీనుడను జుమ్మి, నీవు నన్నేలుకొనుము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు - కమలవాసిని మమ్ముఁ గన్న తల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ - నీ కటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనలు మాకు లోకప్రపంచంబు - నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య - నీ పదధ్యానంబు నిత్యజపము
తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
- నేనెంత వేడిన నీకేల దయ రాదు? - పలుమాఱు పిలిచిన బలుకవేమి?
పలికిన నీకున్న పదవేమి పోవును? - మోమైన బొడచూపవేమి నాకు?
శరణు జొచ్చినవాని సవరించవలె గాక - పరిహసించుట నీకు బిరుదు గాదు
నీ దాసులను నీవు నిర్వహింపకయున్న - బరు లెవ్వరగుదురు పంకజాక్ష!
దాత, దైవంబు, తల్లియుఁ, దండ్రి వీవె!
నమ్మియున్నాను నీ పాదనళినములను
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
- Added By Chaduvu
ప (12)
Add New Padyam
ఫ (1)
Add New Padyam
బ (1)
Add New Padyam
భ (4)
Add New Padyam
మ (3)
Add New Padyam
య (0)
Add New Padyam
ర (0)
Add New Padyam
ల (2)
Add New Padyam
వ (8)
Add New Padyam
శ (3)
Add New Padyam
ష (0)
Add New Padyam
స (4)
Add New Padyam
హ (2)
Add New Padyam
ళ (0)
Add New Padyam
క్ష (0)
Add New Padyam
ఱ (0)
Add New Padyam