భాస్కర శతకము - మారవి వెంకయ్య
విషయ సూచిక :
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
క
ఖ
గ
ఘ
ఙ
చ
ఛ
జ
ఝ
ఞ
ట
ఠ
డ
ఢ
ణ
త
థ
ద
ధ
న
ప
ఫ
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
ళ
క్ష
ఱ
అ
(7)
Add New Padyam
అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టములొక్కరొక్కరిన్
మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!
- Added By
Sarma
అడిగినయట్టి యాచకుల యాశలెరుంగక లోభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె
య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్
గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!
- Added By
Sarma
అతిగుణహీన లోభికిఁ బదార్ధము గల్గిన లేకయుండినన్
మితముగఁ గాని కల్మిగల మీఁదట నైన భుజింపడింపుగా
సతమని నమ్ము దేహమును సంపద; నేరులు నిండి పారినన్
గతుకఁగ జూచుఁ గుక్క తన కట్టడ మీరక యెందు భాస్కరా!
- Added By
Sahasra
అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా!
- Added By
Amerindian_rvc
అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా!
- Added By
Amerindian_rvc
అలఘు గుణప్రసిద్ధుఁడగు నట్టి ఘనుండొకఁ డిష్టుఁడై తనున్
వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలుచేయుఁగా;
తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చినన్ మహా
ఫలదుఁడు కృష్ణుఁడత్యధిక భాగ్యములాతని కీఁడె? భాస్కరా!
- Added By
Amerindian_rvc
అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె
ట్లవగుణులైన నేమి? పనులన్నియుఁ జేకుఱు వారి చేతనే;
ప్రవిమల నీతి శాలియగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే? జలధి దాఁటి సురారులఁ ద్రుంచి భాస్కరా!
- Added By
Lprasanna
ఆ
(2)
Add New Padyam
ఆదరమింత లేక నరుడాత్మబలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదు పేర్మికి గీడగు మూలమె; ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందడె మున్ను భాస్కరా!
- Added By
Sahasra
ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవమొప్పఁగూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే
కూరదదెట్లు; హత్తుగడ గూడునె; చూడఁ బదారువన్నె బం
గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!
- Added By
Sahasra
ఇ
(1)
Add New Padyam
ఇంచుక నేర్పు చాలక విహీనతఁ జెందిన నా కవిత్వమున్
మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలున్
మంచివివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా
డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఈ
(2)
Add New Padyam
ఈ క్షితినర్ధకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా
పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదు రపార మదంబును బూని భాస్కరా!
- Added By
Sahasra
ఈ జగమందు దా మనుజుఁడెంత మహాత్మకుఁడైన దైవమా
తేజము తప్పఁ జూచు నెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులున్
భోజనమై తగన్వనికిఁ బోయి చరింపఁడె మున్ను భాస్కరా!
- Added By
Sahasra
ఉ
(3)
Add New Padyam
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం
బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
- Added By
Sahasra
ఉరుగుణవంతుడొడ్లు తనకొం డపకారము చేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడు జేయగా
నెరుగడు; నిక్కమేకద యదెట్లన? గర్వము బట్టి యంతయుం
దరువగ జొచ్చినం బెరుగుతాలిమి నీయదె వెన్న? భాస్కరా!
- Added By
Sahasra
ఉరుబలశాలి నంచుఁదను నొల్లని యన్య పతివ్రతాంగనా
సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ;
శిరములు గూల రాఘవునిచే దశకంఠుడు ద్రుంగిపోవడే
యెరుగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా!
- Added By
Sahasra
ఊ
(2)
Add New Padyam
ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్
వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!
- Added By
Sahasra
ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా,
చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండగా
జేరి చినింగిపో గొరుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!
- Added By
Sahasra
ఋ
(0)
Add New Padyam
ౠ
(0)
Add New Padyam
ఎ
(4)
Add New Padyam
ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మథించి రంతయున్
వెట్టియె గాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే
యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు దాఁ
జెడఁ దిను నెంతెకాక పుడుసెండు జలంబిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నెన్ని దినంబుల గూడి యుండినన్
దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే
ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?
తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁగాక యది యొప్పని పిమ్మటరూపుమాయఁగా
నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఏ
(3)
Add New Padyam
ఏ గతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం
యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే
లాగు ఘటించు? సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ
జూడగ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే
సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఐ
(0)
Add New Padyam
ఒ
(1)
Add New Padyam
ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఓ
(0)
Add New Padyam
ఔ
(0)
Add New Padyam
అం
(1)
Add New Padyam
అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెరుపం దలపెట్టు, వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయగ జేసె దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా!
- Added By
Sarma
అః
(0)
Add New Padyam
క
(9)
Add New Padyam
కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండిరేని దోఁ
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణాఖ్యుఁ డా
పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!
- Added By
Amerindian_rvc
కట్టడ లేని కాలమున గాదు శుభం బొరులెంతవారు చే
పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లఁ గల్లకా
దెట్టని పల్కినన్; దశరథేశ వసిష్ఠులు రామమూర్తికిన్
బట్టము కట్టఁ గోరి రది పాయక చేకుఱెనోటు భాస్కరా!
- Added By
Amerindian_rvc
కట్టుడ యైనయెట్టి నిజకర్మము చుట్టుచు వచ్చియే గతిం
బెట్టునొ పెట్టినట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ
గిట్టక వ్రేలుఁడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేసిన కర్మముగాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదె కొక్కు? భాస్కరా!
- Added By
Amerindian_rvc
కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా
నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా!
- Added By
Amerindian_rvc
కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో
నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్
బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా
నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా!
- Added By
Amerindian_rvc
కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం
దూఱిన నెంతవారలకుఁ; దొల్లి పరీక్షితు శాపభీతుఁడై
వారిధి నొప్పు నుప్పరిగ పైఁ బదిలంబుగ దాఁగి యుండినం
గ్రూరభుజంగ దంతహరిఁ గూలడె లోకులెఱుంగ భాస్కరా!
- Added By
Amerindian_rvc
కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే
కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్
గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం
పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్
వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీ జలో
దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడి నంతనే
క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఖ
(0)
Add New Padyam
గ
(1)
Add New Padyam
గిట్టుట కేడఁ గట్టడ లిఖించిన నచ్చటఁ గాని యెండుచోఁ
బుట్టదు చావు; జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁగా
ల్గట్టిన శూద్రకున్ భ్రమలఁ గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మఱ్ఱికడఁ బ్రాణము దీసెగదయ్య! భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఘ
(3)
Add New Padyam
ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గిన వానికి హాని లేనిచోఁ
దనదగు సత్త్వమే చెరచుఁ దన్ను; నదెట్లన నీరు మిక్కిలిన్
గను వశియించినన్ జెఱువు కట్టకు సత్వము చాలకున్నచోఁ
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఘనుఁడగు నట్టివాఁడు నిజకార్య సముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్థనఁ జేయుట తప్పుగాదుగా;
యనఘతఁ గృష్ణజన్మమున నా వసుదేవుఁడు మీఁద టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడ కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఘనుఁడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమిఁ బాపఁగా
గనుగొన నొక్క సత్ప్రభువుఁగాక నరాధము లోపరెందరుం
బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున మేఘుఁడు గాక నీటితోఁ
దనుపఁ దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఙ
(0)
Add New Padyam
చ
(6)
Add New Padyam
చంద్రకళావతంసు కృపచాలనినాఁడు మహాత్ముఁడైనఁ దా
సాంద్రవిభూతిఁ బాసి యొక జాతివిహీనునిఁ గొల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రి పద్మ మతిహీనత నొందుట కాదుగా; హరి
శ్చంద్రుఁడు వీరబాహుని నిజంబుగఁ గొల్వఁడె నాఁడు భాస్కరా!
- Added By
Amerindian_rvc
చక్కఁదలంపఁగా విధివశంబున నల్పుని చేతనైనఁ దా;
జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగరాని మహాబలాఢ్యుఁడున్
మిక్కిలి సత్త్వ సంపదల మీఱిన గంధగజంబు మావటీఁ
డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండవె యోర్చి భాస్కరా!
- Added By
Amerindian_rvc
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా
చదువు నిరర్థకంబు, గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
- Added By
Sarma
చాలఁ బవిత్రవంశమున సంజనితుండగునేని యెట్టి దు
శ్శీలునినైనఁ దత్కుల విశేషముచే నొక పుణ్యుఁడెంతయుం
దాలిమి నుద్ధరించును; సుధానిధిఁ బుట్టగఁగాదె శంభుఁడా
హాలహలానలంబు గళమందు ధరించుట పూని భాస్కరా!
- Added By
Amerindian_rvc
చేరి బలాధిపుం డెరిఁగి చెప్పిన కార్యము చేయకుండినన్
బారము ముట్టలేఁడొక నెపంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్
బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం
సారిని గాకుచేసి చెడఁడాయెనె కౌరవభర్త భాస్కరా!
- Added By
Amerindian_rvc
చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునఁ గప్పిపుచ్చి తా
మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు; రాగిపైఁ
బూసిన బంగరుం జెదరిపోవఁ గడంగిన నాఁడు నాటికిన్
దాసిన రాగి గానఁబడదా జనులెల్ల రెఱుంగ భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఛ
(0)
Add New Padyam
జ
(0)
Add New Padyam
ఝ
(0)
Add New Padyam
ఞ
(0)
Add New Padyam
ట
(0)
Add New Padyam
ఠ
(0)
Add New Padyam
డ
(0)
Add New Padyam
ఢ
(0)
Add New Padyam
ణ
(0)
Add New Padyam
త
(7)
Add New Padyam
తగిలి మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతెగాక తా
నెగడి జయింపనేరఁడది నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్
దెగి యొక కోండతో దగరు ఢీకొని తాఁకిన నేమి భాస్కరా!
- Added By
Amerindian_rvc
తడవగ రాదు దుష్టగుణుఁ దత్వ మెఱుంగక యెవ్వరైన నా
చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై
కడుఁ దెఁగఁ జూచుఁగా; మఱుగఁ గాగిన తైలము నీటిబొట్టుపై
బడునెడ నాక్షణంబెగసి భగ్గున మండక యున్నె భాస్కరా!
- Added By
Amerindian_rvc
తనకు నదృష్టరేఖ విశదంబుగఁ గల్గిన గాని లేనిచో
జనునకు నెయ్యెడన్ బరుల సంపదవల్ల ఫలంబు లేదుగా;
కనుగవ లెస్సఁగా దెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్
కనఁబడు నెట్లు వెన్నెలలుఁ గాయగ నందొక రూపు భాస్కరా!
- Added By
Amerindian_rvc
తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా!
- Added By
Amerindian_rvc
తాలిమితోడఁ గూరిమిఁ గృతఘ్నునకెయ్యెడ నుత్తమోత్తముల్
మేలొనరించినన్ గుణము మిక్కిలి కీడగుఁ, బాముపిల్లకున్
బాలిడి పెంచిన న్విషము పాయఁగ నేర్చునె దాని కోఱలం
జాలఁగ నంతకంత కొక చాయను, హెచ్చును గాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
తాలిమితోడుతన్ దగవు దప్పక నేర్పరి యొప్పుదప్పులం
బాలన సేయఁ గాకట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే?
పాలను నీరు వేఱు పరుపంగ మరాళ మెఱుంగుఁగాని మా
ర్జాలమెఱుంగునే తదురు చారురజ్ఞత బూన భాస్కరా!
- Added By
Amerindian_rvc
తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకిఁ జేకొనన్
వలయు నటైన దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు చేత నద్దముం
గలిగినఁ జక్కఁ జేసికొనుఁ గాదె నరుండది చూచి భాస్కరా!
- Added By
Amerindian_rvc
థ
(0)
Add New Padyam
ద
(4)
Add New Padyam
దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్లగాదు ప్ర
త్యక్షము; వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా!
- Added By
Amerindian_rvc
దానపరోపకారగుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేకశూన్యునకు లేములు వచ్చినవేళ, సంపదల్
పూనినవేళ నొక్కసరి పోలును; జీఁకున కర్థరాత్రియం
దైననదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా!
- Added By
Amerindian_rvc
దానము సేయఁ గోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైనఁ బరోపకారమునకై యొక దిక్కునఁ దెచ్చియైన నీఁ
బూనును; మేఘుడంబుధికిఁ బోయి జలంబులఁ దెచ్చి యీయఁడే
వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!
- Added By
Amerindian_rvc
దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్,
దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!
- Added By
Amerindian_rvc
ధ
(0)
Add New Padyam
న
(4)
Add New Padyam
నడవక చిక్కిలేమి యగునాఁడు నిజోదర పోషణార్థమై
యడిగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యముకాదు; పాండవుల్
గడు బలశాలులేవురు నఖండవిభూతిఁ దొలంగి భక్ష్యముల్
గుడువరె యేకచక్రపురిఁ గుంతియుఁ దారొకచోట భాస్కరా!
- Added By
Amerindian_rvc
నుడువుల నేర్పు చాలని మనుష్యుఁడెఱుంగక తప్పనాడినం
గడుఁ గృపతోఁ జెలంగుదురు కాని యదల్పరు తజ్ఞులెల్లఁ, ద
ప్పడుగులు వెట్టుచున్నడుచు నప్పుడు బాలుని ముద్దు చేయఁగా
దొడుగుదు రింతెకాని పడఁద్రోయుదురే యెవరైన భాస్కరా!
- Added By
Amerindian_rvc
నేరిచి బుద్ధిమంతుఁడతి నీతివివేకము దెల్పినం జెడం
గారణమున్నవాని కది కైకొనఁగూడదు నిక్కమే; దురా
చారుఁడు రావణాసురుఁడసహ్యము నొందఁడె చేటుకాలముం
జేరువయైననాఁడు నిరసించి విభీషణు బుద్ధి భాస్కరా!
- Added By
Amerindian_rvc
నొగిలిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయగఁ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా!
- Added By
Amerindian_rvc
ప
(10)
Add New Padyam
పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁడొక్కడు
ద్ధండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్;
కొండొకకోతి చెట్టు కొనకొమ్మల నుండగ, గ్రింద గండ భే
రుండ మదేభ సింహనికురుంబములుండవె చేరి భాస్కరా!
- Added By
Amerindian_rvc
పట్టుగ నిక్కుచున్ మదముఁ బట్టి మహాత్ములఁ దూలనాడినం
బట్టిన కార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్థదోషముల్
పుట్టు, మహేశుఁ గాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞతంత్రముల్
ముట్టకపోయి దక్షునికి మోసము వచ్చెఁగదయ్య భాస్కరా!
- Added By
Amerindian_rvc
పరహితమైన కార్య మతిభారము తోడిదియైనఁ బూను స
త్పురుషుఁడు లోకముల్పొగడఁ బూర్వమునందొక ఱాలవర్షమున్
గురియఁగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేల నెత్తెనట కృష్ణుఁడు ఛత్రము భాతి భాస్కరా!
- Added By
Amerindian_rvc
పలుచని హీనమానవుఁడు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన; వెల్తికుండఁ దా
దొలకుచునుండుఁ గాని మఱి తొల్కునె నిండుఘటంబు భాస్కరా!
- Added By
Amerindian_rvc
పలుమఱు సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్
బలుకఁడొకానొకప్పుడు నవి పల్కినఁ గీడును గాదు నిక్కమే;
చలువకు వచ్చి మేఘుఁడొక జాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగు నోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
పాపపుఁ ద్రోవవాని కొకపట్టున మేను వికాసమొందినన్
లోపల దుర్గుణంబె ప్రబలుం గద! నమ్మగఁ గూడ దాతనిన్;
బాపటకాయకున్ నునుపు పైపయి గల్గినఁ గల్గుగాగ యే
రూపున దానిలోఁగల విరుద్ధపుఁ జేదు నశించు భాస్కరా!
- Added By
Amerindian_rvc
పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టి మానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా
హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా!
- Added By
Amerindian_rvc
పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులం ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా!
- Added By
Amerindian_rvc
ప్రల్లదనంబుచే నెఱుక పాటొక యింతయులేక యెచ్చటన్
బల్లిదుఁడైన సత్ప్రభు నబద్ధములాడినఁ గ్రుంగిపోదు; రె
ట్లల్ల సభాస్థలిం గుమతులై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం
గల్లలు గృష్ణునుం బలికి కాదె హతంబగుటెల్ల భాస్కరా!
- Added By
Amerindian_rvc
ప్రేమను గూర్చి యల్పునకుఁ బెద్దతనంబును దొడ్డవానికిం
దా మతితుచ్ఛపుంబని నెదం బరికింపగ యీయరాదుగా
వామకరంబుతోడఁ గడువం గుడిచేత నపానమార్గముం
దోమఁగ వచ్చునే మిగులఁ దోఁచని చేఁతగు గాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
ఫ
(1)
Add New Padyam
ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచి గుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు; రదెట్లు చంద్రికా
విలసనమైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే
చలువ గలట్టివాఁడగుటఁ జందురు నెంతయుఁ గోరి భాస్కరా!
- Added By
Amerindian_rvc
బ
(4)
Add New Padyam
బంధుర సద్గుణాఖ్యుఁ డొక పట్టున లంపట నొందియైన దు
స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాల హితం బొనరించుఁ గాక, శ్రీ
గంధపుఁ జెక్క రాగిలిచుఁ గాదె శరీరుల కుత్సవార్థమై
గంధములాత్మఁ బుట్టఁ దఱుఁగంబడి యుండుటలెల్ల భాస్కరా!
- Added By
Amerindian_rvc
బలము దొలంగు కాలమునఁ బ్రాభవసంపదలెంత ధన్యుఁడున్
నిలుపుకొనంగనోపఁ; డది నిశ్చయ మర్జునుఁడీశ్వరాదులం
గెలిచినవాఁడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణభార్యలన్
బలువుర నీయఁడే నిలువఁ బట్ట సమర్థుఁడు గాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!
- Added By
Amerindian_rvc
బల్లిదుఁడైన సత్ప్రభువు పాయక యుండినఁ గాని రచ్చలోఁ
జిల్లరవారు నూఱుగురు సేరినఁ దేజము గల్గదెయ్యెడన్
జల్లని చందురుండెడసి సన్నపుఁ జుక్కలు కోటియున్న రం
జిల్లునె వెన్నెలల్ జగము జీఁకటులన్నియుఁ బాయ భాస్కరా!
- Added By
Amerindian_rvc
భ
(5)
Add New Padyam
భుజబల శౌర్యవంతులగు పుత్త్రుల గాంచిన వారి కెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా!
- Added By
Amerindian_rvc
భూనుతులైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్
మాని చరింపరో యనుచు మానవులట్ల చరింపఁబోల; దం
భోనిధులన్నియుం దనదు పుక్కిటఁ బట్టె నగస్త్యుఁడంచు నా
పూనిక కెవ్వఁడోపు నది పూర్వమహత్త్వము సుమ్ము భాస్కరా!
- Added By
Amerindian_rvc
భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ
క్ష్మాపతికార్యమేమయినఁ జాలిరె చేయఁగ నాడు భాస్కరా!
- Added By
Amerindian_rvc
భూరి బలాఢ్యుఁడైనఁ దలపోయక విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవు గాదతఁడొక్కెడ మోసపోవుఁ నా
వీరవరేణ్యుఁ డర్జునుఁడు వింటికి నే నధికుండ నంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగ నోపడు కృష్ణుఁడు లేమి భాస్కరా!
- Added By
Amerindian_rvc
భ్రష్టున కర్థవంతులగు బాంధవులెందఱు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపఁగలేరు; సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిరసంపద లిచ్చు లక్ష్మి యా
జ్యేష్ట కదేటికిం గలుగఁజేయుదు తోడనె పుట్టి భాస్కరా!
- Added By
Amerindian_rvc
మ
(6)
Add New Padyam
మదిఁ దను నాసపడ్డయెడ మంచిగుణోన్నతుఁడెట్టి హీనునిన్
వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా;
త్రిదశ విమానమధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్
మొదల నిడండె ధర్మజుఁడు మూఁగి సురావళి చూడ భాస్కరా!
- Added By
Amerindian_rvc
మాటల కోర్వజాలఁ డభిమానసమగ్రుఁడు ప్రాణహానియౌ
చోటులనైనఁ దానెదురు చూచుచునుండుఁ; గొలంకు లోపల
న్నీట మునింగినప్పుడతి నీచము లాడిన రాజరాజు పో
రాట మొనర్చి నేలఁబడఁడాయెనె భీముని చేత భాస్కరా!
- Added By
Amerindian_rvc
మానవనాథుఁ డాత్మరిపు మర్మ మెఱింగినవాని నేలినం
గాని జయింపలేఁ డరులఁ; గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా
దానవనాయకున్ గెలువఁ దా నెటులోపుఁ దదీయ నాభికా
పానసుధ న్విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా!
- Added By
Amerindian_rvc
మానవుఁ డాత్మకిష్టమగు మంచిప్రయోజన మాచరించుచోఁ
గానక యల్పుఁడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై
మానగఁజూడఁడా పని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా!
- Added By
Amerindian_rvc
మానిని చెప్పు నెట్లెఱుకమాలిన వాఁడటు చేసినన్ మహా
హాని ఘటించు నే ఘనునికైన నసంశయ ముర్విపైఁ గృపా
హీనతఁ బల్కినన్; దశరథేశ్వరుఁ డంగన మాటకై గుణాం
భోనిధి రాముఁ బాసి చనిపోవఁడె శోకముతోడ భాస్కరా!
- Added By
Amerindian_rvc
మునుపొనరించు పాతక మమోఘము జీవులకెల్లఁ బూని యా
వెనుకటి జన్మమం దనుభవింపక తీఱదు; రాఘవుండు వా
లిని బడవేసి తా మగుడ లీల యదూద్భవుఁడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనఁడే తన మేను భాస్కరా!
- Added By
Amerindian_rvc
య
(0)
Add New Padyam
ర
(1)
Add New Padyam
రాకొమరుల్ రసజ్ఞునిఁ దిరంబుగ మన్నన నుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁ దమ లోపలనుంపరు; నిక్కమే కదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక పెంతురే
కాకము నెవ్వరైన శుభకారణ సన్మునిసేవ్య భాస్కరా!
- Added By
Amerindian_rvc
ల
(2)
Add New Padyam
లోకములోన దుర్జనుల లోఁతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుఁడు చేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁ గన్నచోట గుమికూడి యసహ్యపుఁ గూతలార్చుచుం
గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడమంద భాస్కరా!
- Added By
Amerindian_rvc
లోను దృఢంబుగాని పెనులోభిని నమ్మి యసాధ్యకార్యముల్
కానక పూనునే నతఁడు గ్రక్కునఁ గూలును; నోటిపుట్టిపై
మానవుఁ డెక్కిపోవ నొకమాటు బుటుక్కున ముంపకుండునే
తానొకలోఁతునం గెడసి దానిఁ దరింపఁగ లేక భాస్కరా!
- Added By
Amerindian_rvc
వ
(5)
Add New Padyam
వంచన యింతలేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినం
గొంచెమె కాని మేలు సమకూడ దదృష్టము లేనివారికిన్;
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీఁపున మోచునట్టి రా
యంచకుఁ దమ్మితూండ్లు దిననాయెఁగదా ఫలమేమి భాస్కరా!
- Added By
Amerindian_rvc
వట్టుచుఁ దండ్రి యత్యధమ వర్తనుఁడైననుగాని వానికిం
బుట్టిన పుత్త్రకుండు తన పుణ్యవశంబున దొడ్డధన్యుఁడౌ;
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయుఁ గొంచెము దానఁబుట్టునా
చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖలనిండి భాస్కరా!
- Added By
Amerindian_rvc
వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలఁ గను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండుమూఁడు నేఁ
డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మముఁ దెల్ప భాస్కరా!
- Added By
Amerindian_rvc
వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయఁబడ్డచోఁ
గొలదియెఁ గాని యెక్కువలు గూడవు; తమ్ములపాకు లోపలం
గలసిన సున్నమించుకయ కాక మఱించుక యెక్కువైనచో
నలుగడఁ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుక పొక్కక యున్నె భాస్కరా!
- Added By
Amerindian_rvc
వానికి విద్యచేత సిరి వచ్చెనటంచును విద్య నేర్వగాఁ
బూనినఁ బూనుఁగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనఁగ నెవ్వఁడోపు; సరిపోఁ జెవిఁ బెంచును గాకదృష్టతా
హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపఁగనోపు? భాస్కరా!
- Added By
Chaduvu
శ
(1)
Add New Padyam
శ్రీగల భాగ్యశాలి కడఁజేరగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి; రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్
సాగరుఁ జేరుటెల్ల మునిసన్నుత! మద్గురుమూర్తి! భాస్కరా!
- Added By
Sarma
ష
(0)
Add New Padyam
స
(12)
Add New Padyam
సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా
నంతటఁ బోక నెట్టుకొని యప్పటియట్లు వసించియుండు; మా
సాంతమునందుఁ జందురుని నన్నికళల్ పెడఁ బాసి పోయినం
గాంతి వహింపఁడోటు? తిరుగంబడి దేహమునిండ భాస్కరా!
- Added By
Amerindian_rvc
సకలజన ప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైనఁ దడవుండదు వేగమె పాసిపోవుగా;
యకలుషమూర్తియైన యమృతాంశుఁడు రాహువు తన్ను మ్రింగినం
డకటక మాని యుండఁడె! దృఢస్థితి నెప్పటియట్ల భాస్కరా!
- Added By
Amerindian_rvc
సన్నుత కార్యదక్షుఁడొక చాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్త్వసం
పన్నుఁడు భీముఁడా ద్విజుల ప్రాణము కావఁడె యేకచక్రమం
దెన్నికగా బకాసురిని నేపున రూపుడఁగించి భాస్కరా!
- Added By
Amerindian_rvc
సరస దయాగుణంబుగల జాణ మహిం గడు నొచ్చియుండినన్
దఱచుగ వాని కాసపడి దాయఁగ వత్తురు లోకులెట్లనన్
జెఱకురసంబు గానుఁగను జిప్పిలిపోయిన మీదఁ బిప్పియై
ధరఁ బడియున్నఁ జేరవె ముదంబునఁ జీమలు పెక్కు భాస్కరా!
- Added By
Amerindian_rvc
సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణ మొక్కవేళ యం
దొరసిన నిట్లు నీకుఁ దగునో యని చెప్పిన మాన నేర్చుఁదా
బురద యొకించుకంత తముఁ బొందిన వేళలఁ జిల్లవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా!
- Added By
Amerindian_rvc
సారవివేక వర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం
జేరినయంత మూఢులకుఁ జేపడ దానడ; తెట్టులన్నఁ గా
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే
తీరునఁ గల్గ నేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా!
- Added By
Amerindian_rvc
సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలంబగున్
నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం
గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా!
- Added By
Amerindian_rvc
సిరివలెనేని సింహగుహ చెంత వసించినఁ జాలు సింహముల్
కరుల వధింపఁగా నచటఁ గల్గును దంతచయంబు ముత్యముల్
హరువుగ నక్కబొక్క కడ నాశ్రయమందిన నేమి గల్గెడున్
గొరిసెలు దూడతోఁకలును గొమ్ములు నెమ్ములుఁగాక భాస్కరా!
- Added By
Amerindian_rvc
సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్ని హోత్రుఁడౌ
నే నిజభోజ్యముల్ గుడుచు నేనియుఁ బుష్టి వహించు లేనినాఁ
డూని విభూతిలోనడఁగి యుండఁడె తేజము తప్పి భాస్కరా!
- Added By
Amerindian_rvc
స్థానముఁ దప్పివచ్చునెడఁ దానెటువంటి బలాఢ్యుడున్ నిజ
స్థానికుఁడైన యల్పుని కతంబున నైనను మోసపోవుఁగా;
కానల లోపలన్ వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ
గానక చొచ్చినన్ మొసలి కాటుకు లోఁబడదోటు భాస్కరా!
- Added By
Amerindian_rvc
స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్క ము
ష్కరుఁ డతినీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడున్
గొఱతఁ వహింపఁడయ్యెడ; నకుంఠిత పూర్ణసుధాపయోధిలో
నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి కొఱంత భాస్కరా!
- Added By
Amerindian_rvc
స్ఫురతర కీర్తిమంతులగు పుత్త్రుల గాంచినఁగాక మూఢము
ష్కరులఁ గనంగఁ దేజములు గల్గవుగా; మణికీలితాంగుళా
భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినఁగాక గాజు టుం
గరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య? భాస్కరా!
- Added By
Amerindian_rvc
హ
(2)
Add New Padyam
హాళి నిజప్రబుద్ధి తిరమైన విధంబునఁ బెట్టుబుద్ధులా
వేళలకంతె కాని మఱి వెన్కకు నిల్వవు; హేమకాంతి యె
న్నాళులకుండుఁ గాని యొకనాడు పదంపడి సానఁ బట్టినన్
దాళియు నుండునే యినుప తాటక జాయలు పోక భాస్కరా!
- Added By
Amerindian_rvc
హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె
న్నేనియుఁ గల్గియున్న నొక నేరము చెందకపోదు; పద్మముల్
భూనుతిఁ గాంచియున్ బురదఁ బుట్టుట వల్ల సుధాకరోదయం
బైన నసహ్య మొందవె ప్రియంబునఁ జూడఁగ లేక భాస్కరా!
- Added By
Amerindian_rvc
ళ
(0)
Add New Padyam
క్ష
(0)
Add New Padyam
ఱ
(0)
Add New Padyam