Type In Telugu
Novels


సీమ కక్షలు   (Page 41 Of 52)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1667
Votes: 7  (Vote) Posted On 11/19/2008 @8:30:17 PM

చంద్రగ్రహణం
- నాగులారపు విజయసారథి




         "ఇంతకు నువ్వు చేసిన మూడు ఖూనీలకు లెక్కింతిచ్చినాడు నాగిరెడ్డి ?" కొడుకు వేసిన చెంపదెబ్బలాంటి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక పోయాడు నరసింహులు.

         అంతలో ఇంటి వెనుక దొడ్లోంచి తల్లి పిలుపు "నాయనా సెంద్రా, దా నీళ్ళు తోడినా" అని.

         కొన్ని సంవత్సరాలనుంచి తండ్రితో ప్రస్తావించాలనుకున్న విషయాన్ని కాసేపు వాయదా వేయక తప్పలేదు. తిరుపతికి పొద్దున్నే వెళ్ళాలంటే తొలిజామున్నే నిద్రలేవాలి. టౌనుకు దగ్గరగా ఉన్న పల్లెటూరే అయినా, ఆ వూరివాళ్ళకు నవ్య ప్రపంచం లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్న రకరకాల దీపాల గురించి తెల్సినట్టులేదు. అక్కడక్కడ వీధి బల్బుల లోవోల్టేజీతో వెలుగుతున్నాయి. తల్లి తనకన్న ముందే నిద్రలేచి నీళ్ళు కాచింది. అయుదు నిమిషాల్లో రెడీ అయ్యాడు చంద్ర. చిన్న బ్యాగ్ లో ఒక జత బట్టలు, లుంగీ, టవల్ , రెండు పుస్తకాలు సర్దుకున్నాడు. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకులో ఎం. ఏ పాసైనట్లు రిజల్టు తెలిసినప్పటినుచి తిరుపతి వెళ్ళి తన సర్టిఫికేట్స్ తెచ్చుకునే ఆత్రుతలో ఉన్నాడు.

         "ఎలీశాగాన్ని రమ్మన్న నిన్ను బస్సెక్కించేదానికి" ఒక వారగా ఒక దాని మీద ఒకటిగా వేసిన ధాన్యం మూటల మీద కూర్చుని బీడి కాలుస్తూ చెప్పాడు నరసింహులు.

         చేతిలో బ్యాగ్ పక్కనే బెంచిమీద ఉంచి గోడకు ఆనుకుని నిలబడ్డాడు చంద్ర. కాసేపటి క్రితం ఆపిన సంభాషణ ఎలా పునఃప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాడు.

         "చెప్పునాయనా! ఇంక ఈ దుర్మార్గపు పనులు మానేయవా?" నేరుగా అడిగాడు చంద్ర.

         కొన్ని క్షణాలు వారిద్దరి మధ్య మౌనం నెలకొంది. అంతలో నరసింహులు అల్లుడు ఎలీశా ఇంట్లోకి ప్రవేశించాడు.

         "పా బావా, పోదం పా" అన్నాడు వచ్చీరాగానే. అంతలోనే అక్కడ తండ్రీకొడుకుల మధ్య నెలకొన్న మౌనాన్ని పసిగట్టి తాను కూడా మౌనంగా బెంచీమీద కూర్చున్న్నాడు. బీడి చివరి దమ్ములాగి, దాన్ని గోడకేసి రుద్ది ఆర్పేసాడు నరసింహులు.

         "సరే పా... నువ్ పా... కాయితాలు, పుస్తకాలు అన్నీ భద్రంగా తెచ్చుకో" అన్నాడు.


View Comments(11)    Post a Comment    By - Kamal
 
      37  38  39  40  41  42  43  44  45         Page