శ్రీనాథ కవిసార్వభౌములు వెలయించిన అద్భుత రసవత్ప్రబంధం "శృంగార నైషధము". ఈ కావ్యం రసజ్ఞుల ప్రశంసలను అందుకొని, "ఆంధ్ర పంచకావ్యములు" లో అగ్రస్థానమును అలంకరించినది. దీనికి మూలం సంస్కృతములో శ్రీహర్ష మహాకవి విరచించిన "నైషధము". సంస్కృత కావ్యములన్నింటిలో "నైషధం విద్వదౌషధం" అని ప్రసిద్ధి! అనగా, హేమాహేమీలైన పండితప్రకాండుల మేధస్సులకే పని కల్పించే పరమ ఔషధమట ఆ కావ్యం!....... శ్రీహర్షుని కవితాసామర్థ్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీనాథులవారు ఇలా అన్నారు. పనివడి నారికేళఫల పాకమునం జవియైన భట్టహ ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్య లౌ నని కొనియాడనేర, రది యట్టిద! లేజవరాలు చెక్కు గీ టిన వసవల్చు బాలకుడు డెందమునం గలగంగ నేర్చునే |
కవిత్వములోని స్థాయీభేదములను బట్టి ప్రాచీనసాహిత్యమును లాక్షణికులు 3 విధములుగా వర్గీకరించారు. | 1. ద్రాక్షాపాకము: | | ఒకసారి చదవగానే తేలికగా అర్థమై హృదయానికి ఉల్లాసమును, సంతోషమును కలిగించే కవిత్వమును ద్రాక్షాపాకముగా చెప్పుకోవచ్చు. ద్రాక్షపళ్ళు తిని ఆనందించడానికి మనమేమీ శ్రమపడే అవసరం లేదుకదా! నోట్లో వేసుకుంటే చాలు! | | 2. కదళీపాకము: | | అర్థగాంభీర్యముతో కూడుకునివుండి, కొంత కష్టపడినమీదటగాని ఆస్వాదనకు రానటువంటి కవిత్వమును కదళీపాకముగా అభివర్ణించవచ్చు. అరటిపళ్ళు ఆరగించాలంటే కొద్దిగానైనా పనివుంటుంది కదా (తొక్క తీయడం వగైరా)! |
|
|