Type In Telugu
Article 331


ద్రౌపది- అసలు కథ   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1645
Votes: 4  (Vote) Posted On 10/9/2008 @10:58:08 PM

         సత్యనారాయణ గారు రాసిన ఆర్టికల్ చదివాక నేను ఇదే టాపిక్ మీద రాయటం సాహసమే అవుతుందేమో. అయినా కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో పంచుకునేందుకే ఈ ప్రయత్నం.
అసలు ద్రౌపది ఎవరు?
ఆమె ఐదుగురు భర్తలని ఎందుకు వివాహం చేసుకో వలసి వచ్చింది?
మహాభారత యుద్దంలో ఆమె పాత్ర ఏమిటి?
         అనే సందేహాలు మనకందరికి సహజం గానే కలుగుతాయి.

         నాకు కూడా ఇలాంటి సందేహాలే కలిగాయి. అందుకే ఆంధ్ర మహాభారతం ఒక సారి తిరగ వేసా. కొన్నిటికి నన్నయ్య గారు తెలుగించిన ' ఆది పర్వం - సప్తమాశ్వాసం ' లో సమాధానాలు దొరికాయి.

ద్రౌపది పుట్టుక:

         ద్రుపద మహారాజు, ద్రోణుడు బాల్య స్నేహితులు. ఇద్దరు ఒకే గురువు ఐన అగ్నివేశుని వద్ద విద్యాభ్యాసం చేసారు. విద్యాభ్యాసం తరువాత ద్రుపదుడు రాజ్య పాలన చేస్తున్న సందర్భంలో కటిక బీదతనం భరించలేని ద్రోణుడు బాల్య మిత్రుడి వద్దకి సహాయం అర్ధించి వస్తాడు.

         అసలు ద్రౌపది ఎవరు? మహాభారత యుద్దంలో ఆమె పాత్ర ఏమిటి?
ద్రుపదుడు బాల్య మిత్రుని అపహాస్యం చేసి సహాయము చెయ్యక పంపి వేస్తాడు. అందుకు కోపించిన ద్రోణుడు అర్జనుడిని పంపి ద్రుపదుడిని బంధించి తన వద్దకు పిలిపించుకుని అవమానించి పంపుతాడు. అవమానం భరించలేని ద్రుపదుడు - అసమాన ధనుర్విద్యా వేత్త ఐన అర్జనుడివంటి అల్లుడు - ద్రోణుడిని చంపగలిగే కొడుకు కావాలని కోరికతో యాజుడనే బ్రహ్మర్షిని ఆశ్రయిస్తాడు. ఆ యాజుడు ద్రుపదుడి చేత " కాంక్షిత సిద్ధి " అనే క్రతువు చేయిస్తాడు. అందునుండి ద్రుష్టద్యుమ్నుడు, ఆతరువాత అతిలోక సౌందర్య రాశి ఐన కన్యక అవతరించారు.

         వారి జననం నన్నయ్య ఇలా వర్ణించాడు.
క. జ్వాలాభీలాంగుఁడు కర, వాలబృహచ్చాపధరుఁ డు వరవర్మ కిరీ
టాలంకారుఁ డు వహ్నియ, పోలె రధారూడుఁ డొక్క పుత్రుఁ డు పుట్టెన్

మరియు.....
తరలము. కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ యు
త్పలసుగంధి లసన్మహోత్పల పత్ర నేత్ర యఠాళ కుం
తలవిభాసిని దివ్యతేజము దాల్చియొక్క కుమారి ద
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ ప్రసన్నమూర్తి ముదంబుతోన్


View Comments(8)    Post a Comment    By - Devarakonda Subrahmanyam
 
      1  2  3  4         Page