Type In Telugu
Article 322


శర్మగారు - స్వదేశీ యానం   (Page 1 Of 9)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1466
Votes: 6  (Vote) Posted On 10/7/2008 @7:07:00 PM

         మనం రోడ్డుపై నడుస్తుంటే ఎన్నో పిచ్చిమొక్కలు కనిపిస్తూ ఉంటాయి, అవి నిరుపయోగం కాబట్టి అలా పెరిగి పెరిగి నశిస్తూనే ఉంటాయి. అలాంటివే ఎన్నో వెబ్ సైట్స్ కూడా. నిన్న పుట్టి నెల తిరిగే సరికి కనుమరుగయ్యేవి, ఓ వసంతమయ్యాక మసిబారేవి ఇలా వస్తుంటాయి. కాని ఆ పిచ్చిమొక్కల్లోంచి ఎక్కడినుంచో మల్లెల పరిమళం అలవోకగా మనను తాకొచ్చు. అది కలకాలం నిలిచిపోయే సౌగంధికా పుష్ప వనం కావొచ్చు. అలాంటి పరిమళాల పొదరిల్లే ఈ "ఆంధ్రాఫోక్స్".

ఈ సుగంధ వనంలోని ప్రముఖ తరువుల్లో ఒకరే శ్రీ శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ, మనం వాడుకగా పలకరించే మన అలమలం మిత్రులు. శర్మాజీ టీ.పీ లో తొలి పాఠకులు, టీ.పీ నుంచి నావంటివారిని ఫోక్స్ కి పరిచయం చేసినది కూడా వారే కావడం విశేషం. టీ.పీ లో నాకు ఫోక్స్ లోని ఆశాగీతాల లింక్ పంపి వాటిపై నా అభిప్రాయం చెప్పమన్నారు. ఆవి నా సిష్టంలో ప్లే కాలేదు కానీ ఫోక్స్ లో నా ఎంట్రీ మాత్రం జరిగింది.

         శర్మగారింట విరిసిన సిరిమల్లెలు రెండు. చిన్నమ్మాయి ఇక్కడే వైజాగ్ లో బీ.టెక్ చదువుతున్నది. వారి పెద్దమ్మాయికి పెళ్ళని చాలా రోజులనుండీ సంరంభాలు చేసుకొంటున్న విషయం మన ఫోక్స్ చదువరులతో ముచ్చటిస్తూనే ఉన్నారు కూడా. ఆ సందర్భముగా పెండ్లి పనుల నిమిత్తం వారు స్వదేశానికి రావలసిరావడం, అది ఫోక్స్ మిత్రులకి చెపుతూ వీలైతే సాధ్యమైనంతమంది ఫోక్స్ మిత్రులను కలవగలనని తెలియజేయడం యాధృచ్ఛికంగా జరిగినది.

         నాకు మాత్రం తెలియని వ్యక్తులని అందులో సాహిత్యాభిమానులను కలవగలిగే అవకాశం రావడంతో ఏదో తెలియని ఆరాటంతో చాలా ఉక్కిరిబిక్కిరయ్యాను. అదీగాక శర్మాజీ రచనారంగంలో ఒకింత సుస్థిరస్థానం గల ప్రముఖులు కావడంతో వారిని కలవడం తొలిసారి కావున కించిత్ బెరుకు, బిడియం, జంకు ఇత్యాది భావాలు వారిని కలవాలన్న ఆరాటాన్ని సైతం జయించాయి. వాస్తవానికి అఖరి క్షణం వరకూ నాలోని జంకును పోగొట్టేందుకు విఫల ప్రయత్నం చేయడం జరిగింది . ఒకానొకపరి మరెప్పుడైనా కలవొచ్చు అందరూ కలిసినప్పుడు అనుకోవడం కూడా తటస్థించింది.

         ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఎంత చనువుగా మాట్లాడినా కొందరు పెద్దలు తమకు తెలియకుండానే ఎదుటివారికి పరిమితులు సూచించగలరు. నావరకు నాకు శర్మగారు, సత్యనారాయణ గారు, శాస్త్రిగారు మొదలైన పెద్దలతో మాట్లాడడం అంటే చాలా భయం . ఏమి పొరపాటు మట్లాడతానో అని. ఆందుకే వెళ్ళాలా మానాలా అనే సందిగ్ధంలో ఊగిసలాడుతూనే శర్మగారి ప్రోగ్రాం తెలుసుకొన్నాను.


View Comments(20)    Post a Comment    By - Padma Sreeram Vangara
 
      1  2  3  4  5         Page