Type In Telugu
Article 317


భారవి   (Page 1 Of 4)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1176
Votes: 2  (Vote) Posted On 10/5/2008 @7:52:46 AM

         కాళిదాసు వ్రాసిన రఘువంశం, మేఘసందేశం, కుమారసంభవం, మాఘమహాకవి వ్రాసిన శిశుపాలవధ, భారవి వ్రాసిన కిరాతార్జునీయం ఈ అయిదింటిని పంచమహాకావ్యాలంటారు

         అయితే భారవి గురించి ఒక కధ వాడుకలోవుంది.

         భారవి చిన్నతనం నుంచి మంచి కవిత్వం చెప్పేవాడు. అందరూ అతని కవిత్వాన్ని మెచ్చుకొనేవారు. కొందరైతే అతని తండ్రితో మీవాడు చక్కని కవిత్వం చెప్తాడు. ముందు ముందు మహాకవి అయే లక్షణాలున్నాయి అనేవారు. అందుకు ఆ తండ్రి మనసులో ఆనందపడినా కొడుకును మెచ్చుకుంటే ఆయుక్షీణమని, "ఆ! వాడిదేం గొప్ప కవిత్వం కాదులెండి, ఏదో ఆషామాషీగా చెప్పే పదాలు తప్ప" అనేవాడు. అయితే చాటుగా భార్యదగ్గర ఆ ప్రస్తావన వచ్చినప్పుడు తన ఆనందాన్ని వ్యక్తపరిచేవాడు. కొడుకుతో అనవద్దని హెచ్చరించాడు

         వూరంతా తనను మెచ్చుకుంటూవుంటే తండ్రిమాత్రం తనను అంత చులకనగా చూడడం భారవికి కోపం తెప్పించింది. అయినా చాలా కాలం వోపిక పట్టాడు. ఇంతలో అతనికి పెళ్ళైంది. అతని భార్య ముందు కూడా తండ్రి తన కవిత్వం గురించి చులకనగా మాట్లాడడంతో అతని కోపం తారస్థాయికి చేరుకుంది.

         ఇక లాభం లేదని అతను ఒకనాడు తండ్రి భోజనానికి వచ్చేసమయానికి ఒక పెద్ద బండరాయి పుచ్చుకొని అటకమీద ఎక్కి కూర్చున్నాడు. తండ్రి భోజనంచేసే సమయంలో ఆయన నెత్తిమీద వేద్దామని. ఈ విషయం కనిపెట్టిన అతని తల్లి ఏమీ ఎరగనట్టు వూరుకొని భర్త భోజనం చేస్తునప్పుడు అటకమీద కూర్చున్న కొడుక్కి వినబడేటట్టు అడిగింది.

         "ఏమండీ! అందరూ మన భారవిని మెచ్చుకుంటూవుంటే మీరేమిటి వాడిని అంత చులకనగా తీసిపారేస్తున్నారు?" అని.

         ఇది విన్న భారవి, తండ్రి ఏమి సమాధానం చెప్తాడో విందామని హత్యాప్రయత్నం ఆపాడు.


View Comments(4)    Post a Comment    By - Virabhadra Sastri Kalanadhabhatta
 
      1  2  3  4         Page