Type In Telugu
Article 311


అవును అతనే జంబులింగం!   (Page 14 Of 14)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1064
Votes: 3  (Vote) Posted On 11/10/2008 @6:05:16 AM

13

ఏం అబ్బాయ్ ! ఇలా వచ్చావ్ ?
ఈ వేళ నాపుట్టినరోజండి
ఆలాగా! ఇంద ఈ లడ్డు తిను
మీదుకాణంలో స్వీట్లు చాలా బాగుంటాయిటగా
అవును. స్వచ్ఛమైన నేతితో చేసినవి.
మీకో ముఖ్య విషయం చెబ్దామని వచ్చా
ఏమిటది
మొన్న హైదరాబాద్ లో ఒక కుర్రాడు మిఠాయి అంగడికి వెళ్ళి ఒక అరకిలో జిలేబీ ఇమ్మన్నాడుట.
ఊ అయితే
వినండి. తీరా ఇచ్చాక జిలేబి వెనక్కి ఇచ్చి నాకు ఇది అక్కర్లేదు లడ్డు ఇవ్వండి అన్నాడుట. అల్లాగే లడ్డు అరకిలో ఇచ్చాడు.
పాపం వాడికి లడ్డు అంటే ఇష్టమేమో
అప్పుడే జాలిపడకండి. వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూవుంటే దుకాణుదారు ఏఅబ్బాయ్ డబ్బులివ్వకుండా వెళ్ళిపోతున్నావేమిటి అని అడిగాడుట. ఆకుర్రాడు వెనక్కి వచ్చి డబ్బులా?దేనికి? అన్నాడు
అదేమిటి లడ్డులకు డబ్బులివ్వాలిగా
అదేఅడిగాడండి ఆదుకాణుదారు. లడ్డుకి డబ్బులు ఇయ్యి అన్నాడు జిలేబీ బదులు ఇచ్చావుగా? అన్నాడు కుర్రాడు అయితే జిలేబీకి ఇయ్యి అన్నాడు. జిలేబీ వెనక్కి ఇచ్చేసాగా అని చక్కాపోయాడండి
హారి పిడుగా! ఇలాంటి మోసాలుకూడా జరుగుతున్నాయన్నమాట
అవునండి అందుకనే మీకు ముందుగా చెప్తున్నా జాగ్రత్తగావుండమని
నాదగ్గర అలాంటి వేషాలు కుదరవు.
పోనీలెండి. ఈవేళ నా పుట్టినరోజుకదా! ఒక కిలో లడ్డు ఇవ్వండి.
ఇదిగో కిలో. నూటఏభైరూపాయలు
అబ్బో అంత డబ్బు నాదగ్గర లేదు. ఇది వెనక్కి తీసుకొని అరకిలో ఇవ్వండి.
ఏమిటి వెనక్కి తీసుకొని అరకిలో ఇవ్వాలా? ఏం నాయనా నాదగ్గర ఏదో నాటకం ఆడి డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నావా? అదేంకుదరదు. నేను వెనక్కి తీసుకోను. అరకిలో ఇవ్వను.హమ్మా!
అదేమిటండి కిలో అక్కర్లేదు వెనక్కి తీసుకోమంటే తీసుకోరు?
(గట్టిగా) వెళ్ళవయ్యా నాదగ్గర నీపప్పులు వుడకవ్
ఏమండీ ఒకసారి ఇల్లారండి. ఈయన దగ్గర ఒక కిలొ లడ్డు కొన్నానండి. కిలో ఎక్కువ అని వెనక్కి ఇచ్చేసి అరకిలో ఇమ్మంటే ఈకిలో వెనక్కి తీసుకోనంటున్నాడు
ఏమయ్యా! కిలో వద్దంటూంటే వెనక్కి తీసుకొని అరకిలో ఇవ్వడానికేమిటి అభ్యంతరం
మీకు తెలీదండి పంతులుగారు ఈ కుర్రాళ్ళ నాటకాలు. నేను వెనక్కి తీసుకోను. అరకిలో ఇవ్వను.
నువ్వు ముందే అరకిలో అడిగివుండాల్సింది. ఇప్పుడు కుదరదంటున్నాడుగదా! ఏంచేస్తావు. ఆకిలోయే తీసుకుఫో!
సరే ఏంచేస్తాను కిలో పొట్లమే తీసుకుపోతాను
ఏయ్ ఏయ్ అబ్బాయి పరుగెత్తుకుపోతున్నవేమిటి డబ్బులు ఇవ్వకుండా?
ఏమిటి ఆకుర్రాడు డబ్బులు ఇవ్వలేదా

పాత సంఘటనలకు కొసమెరుపులు కనిపెట్టడంలో జంబులింగం అసాధ్యుడే!


View Comments(6)    Post a Comment    By - Virabhadra Sastri Kalanadhabhatta
 
      10  11  12  13  14         Page