Type In Telugu
Article 198


మామమెరికీయం (అమెరికా ఇతివృత్తంతో హాస్య నాటిక)   (Page 1 Of 12)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 962
Votes: 1  (Vote) Posted On 7/29/2008 @2:22:29 PM
ఈ నాటిక తొలిసారి 1990 జనవరి 13 న హ్యూష్టన్ లో ప్రదర్శింపబడింది
(ఇందులో శాస్త్రి పాత్ర నేనే నటించాను)

ఇందువచ్చు పాత్రలు:

         రాజు, జగం, శాస్త్రి, పెళ్ళిళ్ళపేరయ్య, రజని, పార్వతి

స్థలం:

         హ్యూష్టన్ టెక్సాస్ అమెరికా మరియు ఇండియాలోని ఒక పల్లెటూరులో మండువాలోగిలి

1వ రంగం

(తెర ఎత్తగానే – హ్యూష్టన్ మహానగరంలో ఓఇంట్లో డ్రాయింగ్ రూం – టీ.వి, సోఫాలు ఫోను వగైరాలు- రాజు సోఫాలో కూర్చొని పేపరు చదువుతూవుంటాడు. డోర్ బెల్ మ్రోగుతుంది. రాజు లేచి ఎడమవైపు సైడ్ కర్టెన్లోకి వెళ్ళి తిరిగి ‘జగం రా’ అంటూ జగంతో ప్రవేశిస్తాడు)
రాజు: కూర్చో జగం (అని కోక్ టిన్ ఇస్తాడు)
జగం: (తీసుకొని) థాంక్స్ – అవునూ తీరుబడిగా కూర్చున్నావు మరి ఫ్యామిలీని ఇంకా తీసుకురావా?
రాజు: ఏది గురూ! ఇమిగ్రేషన్ వీసాకు అప్లై చేసి ఆర్నెల్లు అయింది. ఇదిగో వస్తుంది అదిగోవస్తుంది అని ఎదురు తెన్నులు చూడ్డంతోనే సరిపోతోంది. అక్కడకీ ఇండియాలో పెళ్ళి చేసుకు వచ్చానని మ్యారేజీ సర్టిఫికెట్ కూడా జతపరిచా! అయినా ఏమిటో వాళ్ళ అనుమానం.. ఇండియా సి బి ఐ కిగాని రిఫర్ చేస్తున్నారో ఏమో??
జగం: బాగుంది. మనదేశం వెళ్ళి అక్కడమ్మాయిని పెళ్ళిచేసుకువస్తే మధ్య వీళ్ళకెందుకో అనుమానం ??బొత్తిగా మనవాళ్ళమీద నమ్మకం పోయింది వీళ్ళకి
(ఇంతలో ‘మిష్టర్ రాజు లెటర్ ఫర్ యు’ అని కేక వినపడుతుంది)
రాజు: అదిగో మా మామ వుత్తరం రాసినట్టున్నాడు.. పక్కింటి బాబ్ పిలుస్తున్నాడు (అంటూ ఎల్ ఎఫ్ లోకి వెళ్ళి ‘ధాంక్సెలాట్ సారీ ఫర్ ది ట్రబుల్ ‘ అంటూ చేత్తో ఒక వుత్తరంతో తిరిగి ప్రవేశిస్తాడు) నేచెప్పలే..ఇదిగో చూడు ఇది మా మా రాసిన వుత్తరమే (అని జగం చేతికి వుత్తరం ఇచ్చి) ఖర్మ సెంటిమెంటుతో చంపుతున్నాడు
జగం: (అయోమయంగా) రాజూ! మీమామ పక్కింటికి వుత్తరం రాయడమేమిటి? పైగా సెంటిమెంట్ అంటావేమిటి?


View Comments(5)    Post a Comment    By - Virabhadra Sastri Kalanadhabhatta
 
      1  2  3  4  5         Page