Type In Telugu
Article 179


విజయ (వాడ) యాత్ర   (Page 1 Of 22)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1557
Votes: 9  (Vote) Posted On 7/14/2008 @7:47:34 AM
         నేను ఆంధ్రఫోక్స్ కి వచ్చాక నాకు చాలామంది ఆత్మీయులే ఏర్పడ్డారు. అంతకుముందే యితర సైట్ల ద్వారా పరిచయమై ఆశీస్సులందించిన వారిలో నాకు దైవ సమానురాలైన శ్రీమతి సుప్రభగారు, ఛందశ్శాస్త్ర గురువుగారు అయిన శ్రీ కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రిగారు, శ్రీ ఆదిభట్ల కామేశ్వరశర్మగారు, పెద్దవారైనప్పటికీ మంచి మిత్రులు శ్రీ దుర్వాసుల నిరంజన్ గారు ముఖ్యులు.

         ఆంధ్రఫోక్స్ కి వచ్చాక శ్రీ శాస్త్రిగారు, నన్ను కూడా వారి మనుమల లిస్టులో చేర్చుకున్నారు. మహితగారు, రాగాజీ, రాజెస్సుగారు, శ్రీ ఆచాళ్ళ శ్రీనివాసరావుగారు, సంధ్యగారు, శ్రీరాధగారు, సహస్రాగారు, జి.యస్. మణ్యం గారు, అనూగారు, శ్రీవేణుగారు, శ్రీలేఖ్యగారు, గీతగారు, కట్టా రాజేశ్, పరాశరం లక్ష్మిగారు, నచికీ గారు, శ్రీవల్లిగారు, డి. యస్. గారు, వజ్జాగారు – వీరంతా ప్రతిరోజు నా యోగక్షేమాలు తెల్సుకునే వారే. చెప్పాలంటే, ఇంకా చాలా మందే ఉన్నారు. ఆప్యాయత చూపించడంలో ఎవరికి వారే సాటి.

         ఇక శ్రీ తుర్లపాటి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే – నేను సైటుకు వచ్చిన కొత్తలో – ఈ సైట్ వారు నెలకొల్పినదే అని నాకు తెలియకుండేది. అసలు ఆ ID (Yamakinkarudu) చూస్తేనే భయమనిపించేది. ఒక సారి ఎప్పుడో “ వీలయితే నాలుగు మాటలు “ లో గీతగారితో మాట్లాడుతూ సైటులో పెట్టాలనుకుంటున్న క్రొత్త ఆఫ్షన్స్ గురించి చెపుతున్నారు. ఆప్పుడు నేనడిగాను “ సైటులో ఆఫ్షన్స్ పెట్టడం మీకు ఎలా వీలవుతుంది" అని. ఆప్పుడు ఆయన అన్నారు “ నేను అడ్మిను కు తక్కువ, యూజర్ కి ఎక్కువ" అందుకే నేను చిన్న చిన్న మార్పులు చేయగలను అని. లోన భయంతో ఉన్నప్పటికీ ఆ సందర్భంగా ఒక పద్యం లో వారి గురించి చెప్పాను. తరువాత తెలిసింది ఈ సైటును నెలకొల్పింది వారేనని.

         ఆ విధంగా ఏర్పడిన పరిచయం మాది. రోజూ నేను వారిని పలకరించడం, వారు నా యోగక్షేమాలు అడిగి తెల్సుకోవడం జరుగుతూ ఉండేది. తరువాత అతి తక్కువ కాలంలోనే ఫోనులో కూడా మాట్లాడారు. ఇక అప్పటినుండి రోజూ మాట్లాడినట్లే మాట్లాడుతారు ఫోనులో.

         ఇవన్నీ ఇలా ఉండగా-


View Comments(24)    Post a Comment    By - Rv Chary
 
      1  2  3  4  5         Page