Type In Telugu
Article 15


మార్పు   (Page 1 Of 2)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 1297
Votes: 4  (Vote) Posted On 11/30/2007 @4:34:27 PM

         మా చిన్నప్పుడు స్కూల్ నుండి రాగానే స్కూల్ బ్యాగ్ అక్కడే పడేసి అమ్మా అమ్మా అంటూ మేము వెతుక్కునే వాళ్ళం. అలా మనం ఇంటికి రాగానే అమ్మ కనపడకపోతే చాలా విసుగు గా కోపంగా కూడా ఉండేది. ఒక్కసారి అమ్మ కనబడగానే హమ్మయ్యా అనుకొని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు ? , నీకోసం ఇందాకటినుండి వెదుకుతున్నా అని అడుగుతాము. ఆ తర్వాత అమ్మ పెట్టినవి తింటూ స్కూల్లో జరిగినవి చెప్పుతూ ఉండేవాళ్ళం ఆ తర్వాత పాలు త్రాగి చక్కగా ఆడుకోవటానికి వెళ్ళేవాళ్ళం.

         కానీ ఇప్పుడు ఎలా ఉంది ? స్కూల్ నుండి ఇంటికి రావటమే గగనంగా ఉంది. స్కూల్ వదలగానే అమ్మ సంగతి పక్కన పెడితే, అసలు ఇంటికే ఎప్పటికో వెళతారు. కొంతమంది ఏ ఎస్ పి (After School Program ) అయితే మరికొంతమంది డేకేర్ అంటారు , ఇంకొంతమంది బాగా డబ్బులు ఉంటే బేబీ సిట్టర్ వచ్చి పిక్ చేసుకుంటుంది.

         ఇక్కడ అమ్మమ్మ-తాతయ్యలు, బామ్మ-తాతయ్యలు ఉండరు చూడటానికి. పొద్దున్న 7 గంటలకు వెళితే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వీళ్ళు పిల్లలను చూస్తారు. అయ్యో పాపం అనిపించకమానదు ఎవరికైనా . కానీ ఏమి చేస్తాం కూటి కోసం తప్పదు అంటారు. ఇండియాలో ఉన్న అందరిని వదిలేసి ఇక్కడేదో ఉందని వస్తారు. సంతోషంగా ఉంటారా అంటే.. ఎవరు నోరు తెరిచినా అందరూ వాళ్ళ వాళ్ళ బాధలు వెళ్ళబోసుకుంటారు. అటు అమ్మ, నాన్నలని వదిలి ఇక్కడేమో పిల్లల్ని డేకేర్ లలో పడేసి సంపాదిస్తుంటే ,అందులో ఆనందం ఉంటుందంటారా ?? అంటే డబ్బుల్లోనే ఆనందం వెతుక్కునే వాళ్ళూ ఉన్నారనుకోండి వాళ్ళని వదిలేద్దాం.

         అలా అని పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో నాలెడ్జ్ ఉన్న ఆడవాళ్ళని ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోమని చెపితే వాళ్ళకి ఇంత చదువు చదివి ఇంట్లో అంట్లు తోముకోవటానికా అని అనిపించకమానదు. మగవాళ్ళేమో వాళ్ళిష్టం మానేయమనే చెపుతున్నా తనే మానటం లేదు అని దాటవేస్తారు తమ మీదకి ఏమీ రాకుండా!.

         నాకు తెలిసిన ఒకరికి పాప తర్వాత బాబు పుట్టాడు . ఆ అమ్మాయి అమ్మ, నాన్న వచ్చారు 3 నెలలు ఉన్నారు , ఆ తర్వాత వెళ్ళిపోయారు. నేను కాల్ చేసి బాబుని ఇప్పుడు ఏమి చేస్తావ్ అని అడిగినప్పుడు, ఇక్కడే మాకు తెలిసిన ఒక ఇండియన్ ఉంది ఆమె చూసుకుంటుంది అని చెప్పింది.


View Comments(7)    Post a Comment    By - శ్రీరాధ
 
      1  2         Page